Duleep Trophy 2026: నార్త్ ఈస్ట్ జోన్‌పై ఘనవిజయం..సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్!
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ శుభారంభం చేసింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో మంగళవారం ముగిసిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ భారీ విజయంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 112.5 ఓవర్లలో 467 పరుగుల భారీ స్కోర్ చేసింది. సుదీప్ కుమార్ ఘరమి(185 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 146), షెహ్‌బాజ్ అహ్మద్(244 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 167) సెంచరీలతో చెలరేగారు. వైభవ్(8)తో పాటు కెప్టెన్ ఇషాన్ కిషన్(4)కూడా నిరాశపర్చాడు.

అనంతరం నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకు ఆలౌటైంది. అభిజిత్ సర్కార్(5/20) ఐదు వికెట్లు తీయగా.. షెహ్‌బాజ్ అహ్మద్(3/20) మూడు వికెట్లు పడగొట్టాడు. అనుకుల్ రాయ్‌కు ఒక వికెట్ దక్కింది. మహమ్మద్ షమీ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాంతో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ నార్త్ ఈస్ట్ జోన్ 146 పరుగులకే కుప్పకూలింది.
అనుకుల్ రాయ్(5/37) ఐదు వికెట్లు తీయగా.. వైభవ్ సూర్యవంశీ(2/11) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, అభిజిత్ సర్కార్, షెహ్‌బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ షమీ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో విఫలమైనా.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇషాన్ కిషన్ అద్భుతమైన కెప్టెన్‌తో జట్టును గెలిపించగా.. వైభవ్ సూర్యవంశీ రెండు వికెట్లు పడగొట్టాడు.
ముఖ్యంగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీ ఆకట్టుకుంది. పరిస్థితులకు తగ్గట్లు ఫీల్డ్ సెటప్ మార్చడంతో పాటు బౌలర్లను రొటేట్ చేసి ఫలితాలను రాబట్టాడు. ఆదివారం ప్రారంభమయ్యే తొలి సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌తో ఈస్ట్ జోన్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు:
ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ 467 ఆలౌట్
నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ 111 ఆలౌట్
నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ 146 ఆలౌట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

