Duleep Trophy 2026: సౌత్ జోన్‌ను ముంచిన స్టార్లు.. విజయం దిశగా ఈస్ట్ జోన్!
ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ విజయం దిశగా సాగుతోంది. 372 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) దూకుడుగా ఆడగా.. శిఖర్ మోహన్(85 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
వైభవ్ సూర్యవంశీ(8), అభిమన్యు ఈశ్వరన్(3) తీవ్రంగా నిరాశపర్చారు. క్రీజులో కుమార కుశాగ్ర(34 బ్యాటింగ్), మహమ్మద్ ఖురైషి( సిక్స్‌తో 26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సౌత్ జోన్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, త్రిపురణ విజయ్, నిదీష్, షేక్ రషీద్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం ఈస్ట్ జోన్ 584 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఈస్ట్ జోన్‌దే టైటిల్..
గురువారం మ్యాచ్‌కు ఆఖరి రోజు కాగా.. ఈస్ట్ జోన్ డిక్లేర్ చేసి సౌత్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించే అవకాశం ఉంది. ఆఖరి రోజు ఆటలో ఎంత దూకుడగా ఆడినా.. 584 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టం. సౌత్ జోన్ ఆలౌట్ కాకపోతే మ్యాచ్ డ్రా అవుతుంది. అప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్‌ను విజేతగా ప్రకటిస్తారు. గెలిచినా.. మ్యాచ్ డ్రా అయినా ఈస్ట్ జోన్‌నే టైటిల్ వరించనుంది.

చేజారిన తిలక్ వర్మ శతకం..
242/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ(211 బంతుల్లో 9 ఫోర్లతో 99)శతకం చేజార్చుకోగా.. దేవదత్ పడిక్కల్(104 బంతుల్లో 4 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించాడు. చామ మిలింద్(68 బంతుల్లో 7 ఫోర్లతో 43) పర్వాలేదనిపించాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్(3/62) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/42), ఖరైషి(2/99), శిఖర్ మోహన్ (2/67) రెండేసి వికెట్లు పడగొట్టారు.
సౌత్ జోన్‌ను ముంచిన స్టార్లు..
అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్ చేరిన సౌత్ జోన్‌ను స్టార్ ఆటగాళ్లు నట్టేట ముంచేసారు. నేరుగా ఫైనల్ మాత్రమే ఆడుతున్న మహమ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ తీవ్రంగా నిరాశపర్చారు. సిరాజ్ చెత్త బౌలింగ్‌తో ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 5.60 ఎకానమీతో 140 పరుగులిచ్చుకున్నాడు. అతని వైఫల్యంతో ఈస్ట్ జోన్ భారీ స్కోర్ నమోదు చేసి సౌత్ జోన్ పతనాన్ని శాసించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


