Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీకి బిగ్ టెస్ట్.. మ్యాచ్ ఎప్పుడంటే..?

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.

వైభవ్ సూర్యవంశీ అచ్చం ధోనీ లానే ఆడుతున్నాడు: రాబిన్ ఊతప్ప

వైభవ్ సూర్యవంశీ అచ్చం ధోనీ లానే ఆడుతున్నాడు: రాబిన్ ఊతప్ప

వైట్ బాల్ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. రెడ్ బాల్ క్రికెట్‌లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆగస్ట్ 23న బెంగళూరులోని బీసీసీఐ సీఓఈలో ప్రారంభం కానున్నాయి. వైభవ్ సూర్యవంశీ ఉన్న ఈస్ట్ జోన్.. నార్త్ జోన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

Duleep Trophy 2026 15 Years Old Vaibhav Sooryavanshi Faces Biggest Red-Ball Test of His Career

బిగ్ టెస్ట్..

ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. దులీప్ ట్రోఫీ ఫైనల్ సెప్టెంబర్ 6న చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరగనుంది. అయితే దులీప్ ట్రోఫీ.. వైభవ్ సూర్యవంశీ‌కి బిగ్ టెస్ట్. రెడ్ బాల్ క్రికెట్‌లో అతని సామర్థ్యానికి ఈ టోర్నీ పరీక్ష. అయితే ఈ టోర్నీలో వైభవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా?లేక మిడిలార్డర్‌లో ఆడుతాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. వైట్‌బాల్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా ఆడుతున్నాడు.

అయితే టెస్ట్ క్రికెట్‌లో ఓపికగా ఆడుతూ క్రీజులో ఎక్కువ సమయ గడపాల్సి ఉంటుంది. కఠినమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాలి. అనవసరమైన బంతులను వదిలేస్తూ వికెట్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వైభవ్ సూర్యవంశీ మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

Also Read

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

పేలవ రికార్డ్..

అయితే రెడ్ బాల్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీకి సరైన రికార్డ్ లేదు. బిహార్ తరఫున ఇప్పటి వరకు 8 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 2 హాఫ్ సెంచరీలతో 207 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాటింగ్ సగటు కేవలం 17.25 మాత్రమే. భవిష్యత్తులో భారత టెస్ట్ టీమ్‌లోకి అడుగుపెట్టాలంటే వైభవ్ తన టెస్ట్ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలి. తన బ్యాటింగ్‌తోనే విమర్శకులకు బదులిస్తూ.. సుదీర్ఘ ఫార్మాట్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అందుకు ఈ దులీప్ ట్రోఫీ అతనికి మంచి అవకాశంగా నిలవనుంది.

Story first published: Friday, August 21, 2026, 9:59 [IST]
Other articles published on Aug 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+