For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Duleep Trophy 2024: తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్.. వావ్ అనాల్సిందే!(వీడియో)

టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-ఏకు ప్రాతినిథ్యం వహించిన తిలక్ వర్మ.. ఇండియా-సీతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని సెన్సేషనల్ క్యాచ్‌కు ఇండియా సీ బ్యాటర్ బాబా ఇంద్రజీత్ పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ క్యాచ్ పట్టిన విధానం చూసి ఇంద్రజీత్‌తో పాటు సహచర ఆటగాళ్లు, అంపైర్లు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు.

ఇండియా సీ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ప్రసిధ్ కృష్ణ 80వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొడ కండరాల గాయంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన బాబా ఇంద్రజీత్.. రెండో ఇన్నింగ్స్‌లో తప్పని పరిస్థితులో 9వ స్థానంలో బరిలోకి దిగాడు. ప్రసిధ్ కృష్ట వేసిన బౌన్సర్‌ను ఇంద్రజీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేయగా.. స్లిప్‌లో ఉన్న తిలక్ వర్మ సూపర్ డైవ్‌తో అద్భుతంగా అందుకున్నాడు.

Duleep Trophy 2024 Tilak Varma s stunning catch to dismiss Baba Indrajith Video goes viral

ఈ వికెట్‌ ఇండియా-ఏ విజయ లాంఛనాన్ని త్వరగా పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏ 132 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఇండియా-ఏ దులీప్ ట్రోఫీ 2024 టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొత్తం నాలుగు జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇండియా-ఏ రెండు విజయాలతో పాయింట్స్‌ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచింది.

350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా-సీ 217 పరుగులకు కుప్పకూలింది. ఇండియా సీ బ్యాటర్లలో సాయి సుదర్శన్(111) ఒక్కడే సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, తనూష్ కోటియన్ మూడేసి వికెట్లు తీయగా.. ఆకీబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. షామ్స్ ములానికి ఓ వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. శశ్వత్ రావత్(124) సెంచరీతో రాణించగా.. ఆవేశ్ ఖాన్(51 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం ఇండియా సీ 234 పరుగులకు కుప్పకూలింది. అభిషేక్ పోరెల్(82) మినహా అంతా విఫలమయ్యారు.

63 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ 286/8 వద్ద డిక్లేర్ ఇచ్చింది. రియాన్ పరాగ్(73), శశ్వాత్ రావత్(53) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Sunday, September 22, 2024, 19:37 [IST]
Other articles published on Sep 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+