ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024కి ఎంపికయ్యాడు. ఈ టోర్నీ రెండో దశ మ్యాచ్‌ల కోసం భారత్ ఏ, బీ, సీ, డీ జట్లలో పలు మార్పులు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కోసం ఎంపికైన ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకోవడంతో సెలెక్టర్లు కొత్త ప్లేయర్లకు అవకాశం కల్పించారు.
ఈ క్రమంలోనే ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్‌ను బీసీసీఐ ఇండియా ఏకు ఎంపిక చేసింది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో షేక్ రషీద్‌కు అవకాశం కల్పించింది. గుంటూరు జిల్లాకు చెందిన 19 ఏళ్ల రషీద్.. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన భారత జట్టులోనూ షేక్ రషీద్ కీలక సభ్యుడు.

గురువారం నుంచి అనంతరపురం వేదికగా దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇండియా-డీతో జరిగే మ్యాచ్‌లో షేక్ రషీద్ ఇండియా-ఏ తరఫున బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అయితే తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఈ టోర్నీ ఆడుతున్నారు.
ఇండియా ఏ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికవ్వడంతో మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఈ జట్టులో రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ప్రసిధ్ కృష్ణవంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
టీమిండియాకు ఎంపికైన వారిలో ఒక్క సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే దులీప్ ట్రోఫీ రెండో మ్యాచ్ కోసం అందుబాటులో ఉండగా.. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, యశ్ దయాల్, అక్షర్ పటేల్ జట్లను వీడారు.
ఇండియా ఏ(అప్‌డేటెడ్): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాద్కర్, షేక్ రషీద్, షామ్స్ ములాని, అకిబ్ ఖాన్.
ఇండియా బీ(అప్‌డేటెడ్): అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్, సుయాస్ ప్రభుదేశాయ్, రింకూ సింగ్, హిమాన్షు.
ఇండియా సీ(మార్పులు లేవు): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.
ఇండియా డీ(అప్‌డేటెడ్): శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ, యశ్ దూబె, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్‌గుప్తా, కేస్ భరత్, సౌరభ్ కుమార్, సంజు శాంసన్, నిశాంత్ సిద్ధు, విద్వాత్ కవెరప్ప.