దులిప్ ట్రోఫీ 2024 టోర్నీలో భాగంగా అనంతపురం వేదికగా జరుగుతున్న ఇండియా సీ వర్సెస్ ఇండియా డీ మ్యాచ్ సందర్భంగా భద్రతా వైఫల్యం తలెత్తింది. అనంతపురంలోని ఆర్టీటీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి స్టేడియంలోకి దూసుకెళ్లాడు.
మైదానంలోకి పరిగెత్తిన సదరు అభిమాని.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా యువ ఓపెనర్, భారత సీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గరకు వెళ్లాడు. అతనికి పాదాభివందనం చేయడంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా తిరుగుముఖం పట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

బీసీసీఐ ఆగ్రహం..
ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీ టోర్నీలో భద్రతా వైఫల్యం తలెత్తడంపై బీసీసీఐ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు సరైన భద్రతా కల్పించలేదా? అని అధికారులను నిలదీసినట్లు సమాచారం. ఈ టోర్నీ మొత్తం అనంతపురంలోని జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనను బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
భద్రతను కట్టుదిట్టం చేయాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. అటు ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ పరుగుల మోత మోగిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఆడపాదడపా అవకాశాలు అందుకున్నాడు.
రుతురాజ్ సేనకు స్వల్ప ఆధిక్యం..
ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా సీ 4 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. 91/4 ఓవర్‌నైడ్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా సీ తొలి ఇన్నింగ్స్ 168 పరుగులకు ఆలౌటైంది. బాబా ఇంద్రజిత్(72), అభిషేక్ పోరెల్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా(4/33) నాలుగు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, సరాన్ష్ జైన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాక్రే తలో వికెట్ తీసారు.
అంతకుముందు ఇండియా డీ.. అక్షర్ పటేల్(83) అసాధారణ పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు కుప్పకూలింది.
అథర్వ టైడ్(4), యశ్ దుబే(10), శ్రేయస్ అయ్యర్(9), దేవదత్ పడిక్కల్(0), రికీ భుయ్(4), శ్రీకర్ భరత్(13), సరన్ష్ జైన్(13), హర్షిత్ రాణా(0), అర్ష్‌దీప్ సింగ్(13) దారుణంగా విఫలమయ్యారు.
అయ్యర్ హాఫ్ సెంచరీ..
ఇండియా సీ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్(3/19) మూడు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(2/47), హిమన్షఉ చౌహన్(2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ తలో వికెట్ తీసారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా డీ నిలకడగా ఆడుతుంది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు.
A fan entered into the stadium and touched Ruturaj Gaikwad’s feet..
— 𝐖𝐡𝐢𝐬𝐭𝐥𝐞𝐩𝐨𝐝𝐮 𝐅𝐂 (@CSK_Zealots) September 6, 2024
Ruturaj earned fans love even before a solid international career.. he will emerge as the next biggest cricketing icon in the nation!@Ruutu1331 #MassCraze pic.twitter.com/E8Usi1m5KT