ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాసన్(83 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89 బ్యాటింగ్) వన్డే తరహా బ్యాటింగ్‌తో చెలరేగాడు. దులీ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్‌లు గురువారం ప్రారంభమవ్వగా.. ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డీ తరఫున సంజూ శాంసన్ బరిలోకి దిగాడు.
అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా డీ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 77 ఓవర్లలో 5 వికెట్లకు 306 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌తో పాటు దేవదత్ పడిక్కల్(50), శ్రీకర్ భరత్(52), రికీ భుయ్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. క్రీజులో సంజూ శాంసన్‌తో పాటు సరాన్ష్ జైన్(26 బ్యాటింగ్) ఉన్నాడు. ఇండియా బీ బౌలర్లలో రాహుల్ చాహర్(3/60) మూడు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, నవ్‌దీప్ సైనీ తలో వికెట్ పడగొట్టారు.

మరో 11 పరుగులు చేస్తే సంజూ శాంసన్ శతకం సాధిస్తాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడిన సంజూ శాంసన్.. ఇండియా డీకి భారీ స్కోర్ అందించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగినా.. సంజూ చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ఎంపికయ్యే అవకాశాలు ఉణ్నాయి. శ్రీలంక పర్యటనలో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్.. దులీప్ ట్రోఫీతో తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు.
భారత్-ఏ 224/7
ఇండియా సీతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 77 ఓవర్లలో 7 వికెట్లకు 224 పరుగులు చేసింది. శశ్వాత్ రావత్(122 బ్యాటింగ్) అజేయ శతకంతో రాణించగా.. ఆవేశ్ ఖాన్(16 బ్యాటింగ్) అతనికి అండగా నిలిచాడు. ఇండియా సీ బౌలర్లలో అన్షూల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా.. విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు, గౌరవ్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన ఇండియా-ఏ బ్యాటర్ తిలక్ వర్మ(5).. ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.