Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanju Samson: పాపం సంజూ.. మళ్లీ అన్యాయమే!

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి అన్యాయమే జరిగింది. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ‌కి సెలెక్టర్లు సంజూ శాంసన్‌ను పరిగణలోకి తీసుకోలేదు

ఈ టోర్నీ తొలి రౌండ్‌లో బరిలోకి దిగే జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీ ఆడుతారని ప్రచారం జరిగినా.. వారితో పాటు బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. సంజూ శాంసన్‌తో పాటు రింకూ సింగ్‌, పృథ్వీ షాలను కూడా పరిగణలోకి తీసుకోలేదు.

Duleep Trophy 2024 Sanju Samson Ignored Again Fans Criticise BCCI For Not consider Red Ball Cricket

శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరణ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లను సారథులుగా ఎంపిక చేశారు. రిషభ్ పంత్‌, కేఎల్‌ రాహుల్‌లకు సారథ్య బాధ్యతలు ఇవ్వకపోవడం కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. వికెట్ కీపర్లుగా ధ్రువ్ జురెల్, ఎన్‌ జగదీషన్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లు అవకాశాన్ని అందుకున్నారు.

సంజూ శాంసన్‌ను రెడ్ బాల్ క్రికెట్‌‌కు పరిగణలోకి తీసుకోవడం లేదని విషయం స్పష్టమైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇతర వికెట్ కీపర్స్‌లా అతనికి కూడా అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక పర్యటనలో వచ్చిన రెండు అవకాశాలను సంజూ శాంసన్ వృథా చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటయ్యాడు. దాంతోనే అతన్ని సెలెక్టర్లు పూర్తిగా పక్కనపెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది. కొందరు మాత్రం పాపం సంజూ శాంసన్ అంటూ అతనిపై జాలి చూపిస్తున్నారు.

దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్లు:
టీమ్ ఏ: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శస్వాత్ రావత్.

టీమ్ బీ: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవాస్థి, ఎన్ జగదీషన్(కీపర్).

టీమ్ సీ: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, రజత్ పటీదార్, అభిషేక్ ఫోరల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, బీ ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మనవ్ సుథార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్‌కుమార్, అన్షుల్ కంబోజి, హిమాన్ష చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్, సందీప్ వారియర్.

టీమ్ డీ: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ టైడ్, యశ్ దుబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సెంగుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్.

Story first published: Wednesday, August 14, 2024, 20:26 [IST]
Other articles published on Aug 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+