టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా బీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. ఇండియా ఏతో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో తనదైన వికెట్ కీపింగ్‌తో ఔరా అనిపించాడు. వికెట్ల వెనుకాలా సూపర్ డైవ్‌తో అసాధారణ క్యాచ్ అందుకున్నాడు.
రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌కు మయాంక్ అగర్వాల్(36) నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు నవ్‌దీప్ సైనీ వేసిన స్టన్నింగ్ డెలివరీకి శుభ్‌మన్ గిల్(25) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సైనీ ఇన్‌స్వింగర్‌కు శుభ్‌మన్ గిల్ నోరెళ్లబెట్టాడు. బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయిన అతను కనీసం టచ్ కూడా చేయకుండా చూస్తూ నిలబడిపోయాడు.

నవ్‌దీప్ సైనీ వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌తో శుభ్‌మన్ గిల్‌ను ఆడించిన నవ్‌దీప్ సైనీ చివరి బంతిని తెలివిగా ఇన్‌స్వింగర్ వేసాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో పడిన బంతి అనూహ్యంగా స్వింగ్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను లేపేసింది. గంటకు 140 ప్లస్ కిలోమీటర్ల వేగంతో ఈ బంతిని వేయడంతో శుభ్‌మన్ గిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. బంతి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తుందని పొరబడిన శుభ్‌మన్ గిల్ ఆడకుండా వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు.
తన మరుసటి ఓవర్ రెండో బంతికి మయాంక్ అగర్వాల్‌ను రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో సైనీ పెవిలియన్ చేర్చాడు. 15వ ఓవర్ రెండో బంతిని లెగ్ స్టంప్ దిశగా వేయగా.. మయాంక్ అగర్వాల్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్స్ తీసుకున్న బంతి వికెట్ కీపర్‌కు ఎడమ వైపు దూరంగా వెళ్లింది. రిషభ్ పంత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు వికెట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఏ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 2 వికెట్లకు 134 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(27 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(23 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు ఇండియా-బీ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. ముషీర్ ఖాన్(373 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 181) భారీ శతకంతో చెలరేగగా.. టెయిలెండర్ నవ్‌దీప్ సైనీ(144 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరూ 8వ వికెట్‌కు 205 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇండియా బీ జట్టును ముషీర్ ఖాన్ ఆదుకున్నాడు.