Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy 2024: శ్రేయస్ అయ్యర్ సేనకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!

ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభానికి ముందే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇండియా డీ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తొలి రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో అతను ఫస్ట్ రౌండ్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

షెడ్యూల్ ప్రకారం శ్రేయస్ అయ్యర్ సేన.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా సీ టీమ్‌తో గురువారం అనంతపురం వేదికగా తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. సరిగ్గా ఈ మ్యాచ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఇషాన్ కిషన్ గాయంతో తప్పుకున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం సంజూ శాంసన్.. అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీకి సంజూ శాంసన్‌ను బీసీసీఐ ఎంపిక చేయని విషయం తెలిసిందే.

Duleep Trophy 2024 Ishan Kishan Likely To Miss Duleep Trophy opener Due to Hamstring Injury

ఇక సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి దులీప్ ట్రోఫీ 2024 జరగనుంది. ఇంటర్నేషనల్ స్టార్స్‌తో అభిమానులను అలరించనుంది. ప్రతీ ఏడాది జరిగే దులీప్ ట్రోఫీ‌లో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్‌ జట్లు తలపడుతాయి. కానీ ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఏ,బీ,సీ, డీ జట్లను భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో రెడ్ బాల్ క్రికెట్‌కు కుర్రాళ్లను సంసిద్దం చేయాలనే లక్ష్యంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాతే బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు భారత జట్టును ప్రకటిస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. దాంతో ఈ టోర్నీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తొలి రౌండ్ మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరమవ్వడంతో అతను బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ కూడా ఎంపికయ్యే అవకాశం లేదు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇషాన్ కిషన్‌కు గాయం రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అతను తమిళనాడు వేదికగా జరిగిన బుచ్చి బాబు టోర్నీ కూడా ఆడాడు.

ఇండియా డీ: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ టైడ్, యశ్ దుబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సెంగుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్.

Story first published: Wednesday, September 4, 2024, 17:20 [IST]
Other articles published on Sep 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+