For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Duleep Trophy 2024 విజేతగా ఇండియా-ఏ.. ఎగిరి గంతేసిన తిలక్ వర్మ!(వీడియో)

ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2024లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏ విజేతగా నిలిచింది. మొత్తం నాలుగు జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ముగిసే సరికి ఇండియా-ఏ రెండు విజయాలతో పాయింట్స్‌ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకుంది.

ఇండియా-సీతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇండియా-ఏ 132 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది. 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా-సీ 217 పరుగులకు కుప్పకూలింది. ఈ ఓటమితో రెండో స్థానంలో నిలిచి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది.

Duleep Trophy 2024 India A defeats India C by 132 runs to win title

రియాన్ పరాగ్-తిలక్ వర్మ సంబరాలు..
ఇండియా సీ బ్యాటర్లలో సాయి సుదర్శన్(111) ఒక్కడే సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, తనూష్ కోటియన్ మూడేసి వికెట్లు తీయగా.. ఆకీబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. షామ్స్ ములానికి ఓ వికెట్ దక్కింది.

చివరి వికెట్‌గా అన్షుల్ కంబోజ్‌ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగానే.. ఇండియా-ఏ ఆటగాళ్లు ఎగిరి గంతేసారు. తెలుగు తేజం తిలక్ వర్మతో పాటు రియాన్ పరాగ్ అసాధారణ రీతిలో సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

శశ్వత్ రావత్ శతకం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. శశ్వత్ రావత్(124) సెంచరీతో రాణించగా.. ఆవేశ్ ఖాన్(51 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం ఇండియా సీ 234 పరుగులకు కుప్పకూలింది. అభిషేక్ పోరెల్(82) మినహా అంతా విఫలమయ్యారు.

63 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ 286/8 వద్ద డిక్లేర్ ఇచ్చింది. రియాన్ పరాగ్(73), శశ్వాత్ రావత్(53) హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో రాణించిన శశ్వాత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో 16 వికెట్లతో పాటు 41 పరుగులు చేసిన ఇండియా-సీ బౌలర్ అన్షుల్ కంబోజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

Story first published: Sunday, September 22, 2024, 18:21 [IST]
Other articles published on Sep 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+