Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy 2024: నో కోహ్లీ, రోహిత్.. బరిలోకి దిగే నాలుగు జట్లు ఇవే!

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 తొలి రౌండ్‌లో పాల్గొనే జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సాధారణంగా దులిప్ ట్రోఫీ ఈస్ట్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ జట్ల మధ్య జరుగుతుంది. కానీ ఈ సారి ఇంటర్నేషనల్ స్టార్, దేశవాళీ స్టార్లను కలిపి ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ సిరీస్‌లకు భారత అత్యుత్తమ టెస్ట్ టీమ్‌ను ఎంపిక చేయడంపై భారత సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీ ఫార్మాట్‌ను మార్చారు. ఈ టోర్నీకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉంటారని ప్రచారం జరిగినా.. వారికి రెస్ట్ ఇచ్చారు. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్‌లు నాలుగు జట్లకు సారథులుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

Duleep Trophy 2024 BCCI announced Squads for first round

తెలుగు రాష్ట్రాల నుంచి తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రికీ భుయ్‌లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే అతనికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కనుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యే ఆటగాళ్లు.. ఈ టోర్నీ చివరి దశలో దూరమవుతారు. సెప్టెంబర్ 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

టీమ్ ఏ: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, శస్వాత్ రావత్.

టీమ్ బీ: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవాస్థి, ఎన్ జగదీషన్(కీపర్).

టీమ్ సీ: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, రజత్ పటీదార్, అభిషేక్ ఫోరల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, బీ ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మనవ్ సుథార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్‌కుమార్, అన్షుల్ కంబోజి, హిమాన్ష చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్, సందీప్ వారియర్.

టీమ్ డీ: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ టైడ్, యశ్ దుబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సెంగుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్.

Story first published: Wednesday, August 14, 2024, 17:27 [IST]
Other articles published on Aug 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+