For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2026: కొంపముంచిన ఆర్‌సీబీ చెత్త ఫీల్డింగ్!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది. ప్రముఖ ర్యాపర్ హానీ సింగ్ పాట.. జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఆట అభిమానులను ఉర్రతలూగించింది. ముఖ్యంగా హానీ సింగ్ పాడిన లుంగి డ్యాన్స్ పాట స్టేడియాన్ని షేక్ చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తలపడ్డాయి.

ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగినా.. ఫీల్డర్లు సునాయస క్యాచ్‌లు వదిలేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 155 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. నికోలా కేరీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 40), సజీవన్ సజన(25 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 45) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(17 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20), గునలన్ కమలిని(28 బంతుల్లో 5 ఫోర్లతో 32) పర్వాలేదనిపించారు. అమెలియా కేర్(4), నాట్ సీవర్ బ్రంట్(4) తీవ్రంగా నిరాశపర్చారు. ఆర్‌సీబీ బౌలర్లలో నదినే డీ క్లెర్క్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, శ్రేయాంక పాటిలో చెరో వికెట్ పడగొట్టారు.

Dropped Catches Hurt RCB as Sajana-Carey Stand Lifts Mumbai Indians to 154 6 in WPL 2026 Clash

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ అమెలియా కేర్(4)ను లారెన్ బెల్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 34 పరుగులే చేసింది. ఆవెంటనే నాట్ సీవర్ బ్రంట్‌ను డీక్లెర్క్ పెవిలియన్ చేర్చింది. దాంతో ముంబై 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్, కమలిని జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడిని శ్రేయాంక పాటిల్ విడదీసింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన కమలిని క్లీన్ బౌల్డ్ చేసింది.

ఆ వెంటనే హర్మన్‌ప్రీత్ కౌర్‌ను డీక్లెర్క్ ఔట్ చేయడంతో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సజీవన్ సజన ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను ఆర్‌సీబీ ఫీల్డర్లు వదిలేసారు. ఈ అవకాశంతో చెలరేగిన ఆమె.. బౌండరీలతో విరుచుకుపడింది. ఆమెకు తోడు నికోల క్యారీ కూడా రాణించడంతో ముంబై స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్‌లో హాఫ్ సెంచరీ ముంగిట సజన‌, నికోలా క్యారీని డీక్లెర్క్ ఔట్ చేసింది.

Story first published: Friday, January 9, 2026, 21:56 [IST]
Other articles published on Jan 9, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+