గంగూలీ గుండె గట్టిది.. అతను ఇప్పుడు మారథన్ రన్ కూడా చేయగలడు: ప్రముఖ కార్డియాలజిస్టు

కోల్‌కతా: గుండె పోటుకు గురైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పూర్తిగా కోలుకున్నాడని అతన్ని పరీక్షించిన ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ శెట్టి తెలిపారు. మంగళవారం దాదాను ప్రత్యేకంగా పరీక్షించిన ఆయన గంగూలీకి ఎలాంటి అపాయం లేదన్నారు. ప్రస్తుతం దాదా 20 ఏళ్ల వయసులో ఉన్నట్లే ఫిట్‌గా ఉన్నారని, విమాన ప్రయాణంతో పాటు మారథాన్ రన్ కూడా చేస్తాడని పేర్కొన్నారు.

మళ్లీ క్రికెట్ కూడా ఆడొచ్చు..
‘ఈ గుండెపోటు అతని లైఫ్‌స్టైల్, లైఫ్‌స్పాన్‌పై ఏ మాత్రం ప్రభావం చూపదు. అందరిలానే సాధారణ జీవితాన్ని కొనసాగించనున్నాడు. సౌరవ్ మారథన్ రన్ చేయడంతో పాటు విమానాల్లో కూడా ప్రయాణించగలడు. అతను కావాలనుకుంటే మళ్లీ క్రికెట్ కూడా ఆడవచ్చు. ఇది అతని గుండెకు ఎలాంటి హానీ చేయలేదు. ఎప్పటిలానే అతని పనులన్నీ చేసుకోవచ్చు. అతి త్వరలో అతను డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లనున్నాడు.'అని శెట్టి తెలిపారు. గత శనివారం ఇంట్లో ట్రేడ్‌మిల్ చేస్తుండగా హార్ట్ ఎటాక్‌కు గురైన గంగూలీ స్థానిక వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.

అది దాదా ఇష్టం..
దాదా హార్ట్‌లో మూడు బ్లాక్స్ గుర్తించిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి ఒక స్టెంట్ వేయడంతో దాదాకు ప్రాణాపాయం తప్పిన విషయం తెలిసిందే. ఇక గంగూలీ బుధవారం డిశ్చార్జ్ అవుతాడని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అతని గుండెలో మిగిలిన రెండు బ్లాక్స్‌ను పూడ్చుకోవడానికి దాదా ముందు రెండు మార్గాలున్నాయని దేవీ శెట్టి అన్నారు.‘మిగిలిన రెండు బ్లాక్స్ నయమవడానికి దాదా ముందు మెడికేషన్, యాంజియాప్లాస్టీ రెండు మార్గాలున్నాయి. యాంజియాప్లాస్టీ చేయించుకోవడమే ఉత్తమం. ఇది దాదా నిర్ణయానికే వదిలేశాం. రెండు వారాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానన్నాడు.'అని శెట్టి తెలిపారు.

దేశం మొత్తం షేక్..
వరల్డ్ క్లాస్ క్రికెటర్, కనీసం మద్యం, దూమపానం, ఇతర చెడు అలవాట్లు ఏమాత్రం లేని సౌరవ్ గంగూలీకి అది 48 ఏళ్ల వయసులో గుండెపోటు రావడం యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. చాలా మందికి అనేక ప్రశ్నలు తలెత్తాయి. పూర్తి ఫిట్‌గా ఉండే వ్యక్తలకు కూడా గుండెపోటు వస్తుందా? అనే సందేహం కలిగింది. అయితే కార్డియాలజిస్టు దేవీ శెట్టి మాత్రం ప్రతీ ఒక్కరు ముందస్తు హార్ట్ చెకప్ చేసుకోవాలన్నారు.

చెకప్ చేసుకోవాలి..
‘లైఫ్‌స్టైల్‌ను ఎంత స్ట్రిక్ట్‌గా కొనసాగించినా.. అథ్లెట్ అయినా సరే ముందుస్తు హార్ట్ చెకప్ చేయించుకోవాలి. గంగూలీ ముందే చెకప్ చేసుకుంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు. కనీసం గంగూలీని చూసైనా ప్రతీ అథ్లెట్ కనీసం రెండేళ్లకు ఒకసారైన గుండె సంబంధిత పరీక్షలు చేసుకోవాలి.'అని సూచించాడు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications