Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిస్‌ఫీల్డ్ మిరాకిల్.. క్రికెట్‌ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రనౌట్! (వీడియో)

క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రనౌట్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)‌లో చోటు చేసుకుంది. ఫీల్డింగ్‌లో జరిగిన తప్పిదంతో ఫ్రస్టేట్ అయిన ఫీల్డర్ బంతిని తన్నగా.. అనూహ్యంగా అది స్టంప్స్‌ను తాకి రనౌట్‌గా రివార్డ్ లభించింది. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ కనీవినీ ఎరుగని రనౌట్ కారణంగా మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

అసలేం జరిగిందంటే..?

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఔటర్ ఢిల్లీ వారియర్స్, న్యూఢిల్లీ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ హోరాహోరీ సాగగా.. ఆఖరి బంతికి మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఔటర్ ఢిల్లీ వారియర్స్ విజయానికి ఆఖరి బంతికి ఒక్క పరుగు అవసరం కాగా.. న్యూఢిల్లీ టైగర్స్ బౌలర్ లక్ష్మణ్ వేసిన యార్కర్‌ను బ్యాటర్ ప్రధామ్ చాలుజా మిడాఫ్ వైపు ఫ్లిక్ చేయగలిగాడు.

DPL Misfield Turns Into Miracle Run-Out in Delhi Premier League 2026 Video Goes Viral

అక్కడే ఉన్న ఫీల్డర్ హిమ్మత్ సింగ్ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అతను బంతిని బలంగా తన్నగా అది కాస్త స్టంప్స్‌‌ను తాకడంతో బ్యాటర్ రనౌటయ్యాడు. దాంతో మ్యాచ్ టైగా మారింది. అనూహ్య రనౌట్ రూపంలో రివార్డ్ లభించినా.. ఈ మ్యాచ్‌లో న్యూఢిల్లీ టైగర్స్ విజయం సాధించలేకపోయింది. సూపర్ ఓవర్‌‌లో ఔటర్ ఢిల్లీ వారియర్స్ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

సూపర్ ఓవర్‌లో తప్పని ఓటమి..

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించి ఆడించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూఢిల్లీ టైగర్స్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 15 పరుగులు చేసింది. అనంతరం ఔటర్ ఢిల్లీ వారియర్స్ కూడా 15 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూపర్ ఓవర్‌లో ఔటర్ ఢిల్లీ వారియర్స్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేయగా.. న్యూఢిల్లీ టైగర్స్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.

Story first published: Wednesday, August 5, 2026, 13:10 [IST]
Other articles published on Aug 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+