అంపైర్ గూబ పగలగొట్టిన బ్యాటర్!(వీడియో)
ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్) 2026 సీజన్‌లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన షాట్‌కు అంపైర్ గూబ పగిలింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అంపైర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో ఆ జట్టు బ్యాటర్ లక్ష్య తరేజా పవర్‌ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. బంతి కాస్త ప్రధాన అంపైర్ ధర్మేష్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తాకింది. ఈ షాట్ ఆడగానే అంపైర్ అప్రమత్తమై కిందికి వంగినా తప్పించుకోలేకపోయాడు.

వెంటనే అంపైర్‌ను ఫిజియోలు పరీక్షించి మైదానం బయటకు పంపించారు. ప్రస్తుతం అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంపైర్ భరద్వాజ్‌కు మైదానంలో బంతి తాకడం ఇదే తొలిసారి కాదు. డీపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో మరో బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ అతని భుజానికి బలంగా తాకింది. కానీ ఆ సమయంలో పెద్ద గాయం కాలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. మయాంక్ రావత్(40), సూర్యన్ష్ రైనా(33), అర్పిత్ రాణా(33), వాన్ష్ మెహ్రా(35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం న్యూఢిల్లీ టైగర్స్ 19.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటై 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హిమ్మత్ సింగ్(31), వైభవ్ రావల్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంపైర్‌ను గాయపర్చిన లక్ష్య తరేజా 25 బంతుల్లో ఫోర్‌తో 21 పరుగులే చేశాడు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాపం అంపైర్ అని సానుభూతి చూపిస్తున్నారు. అంపైర్లు కూడా హెల్మెట్‌లు వాడాలని, టీ20 ఫార్మాట్‌లో తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. ఈ ఘటన అంపైర్ల సెక్యూరిటీపై మరోసారి చర్చకు తెరలేపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
