Virat Kohli: కింగ్ ఆగమనానికి 15 ఏళ్లు!
సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ అంతా ఒకవైపు.. విరాట్ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్ భయపడేంత.. సచిన్..తర్వాత కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. తనదైన ఆటతో, కెప్టెన్సీతో ఆటలో మైలురాళ్లను అధిగమిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోయాడు. అనూహ్యంగా అభిమానులను నిరాశపరుస్తూ గతేడాది టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్.. 15 ఏళ్ల క్రితం ఇదే రోజు టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా టెస్టుల్లో విరాట్ నెలకొల్పిన అరుదైన ఘనతలను గుర్తు చేసుకుందాం.
విండీస్‌పై అరంగేట్రం..
2011 జూన్ 20న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ.. ఆ తర్వాత కాలంలో ప్లేయర్‌గా.. కెప్టెన్‌గా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాడు. టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన అరంగేట్రం సిరీస్‌లో వెస్టిండీస్‌తో నాలుగో టెస్టులో, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి వరుసగా రెండు అర్ధసెంచరీలు చేశాడు. తర్వాత ఆస్ట్రేలియాపై తన తొలి సెంచరీ సాధించాడు. ఇది విరాట్‌కు ఎనిమిదో టెస్టు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ, విరాట్ బ్యాటింగ్‌పై ప్రశంసలు వచ్చాయి.

అత్యుత్తమ కెప్టెన్‌గా..
విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 68 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టెస్ట్ చరిత్రలోనే అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.
కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు: టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా 7 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీనే. లారా (5) రికార్డును ఆయన అధిగమించారు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు కోహ్లీనే. సచిన్, సెహ్వాగ్ 6 డబుల్ సెంచరీలు చేశారు.
ఒకే ఏడాది 6 శతకాలు..
కోహ్లీ కెప్టెన్సీలోనే భారత టెస్ట్ జట్టు వరుసగా ఐదేళ్ల పాటు (2017 నుంచి 2021 వరకు) ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. 2017లో కోహ్లీ కేవలం ఒకే ఏడాదిలో 6 టెస్ట్ సెంచరీలు నమోదు చేశారు. అందులో మూడు డబుల్ సెంచరీలు ఉండటం గమనార్హం. టెస్టుల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో30 సెంచరీలతో పాటు 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
భారత్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్(15921), రాహుల్ ద్రవిడ్(13265), సునీల్ గవాస్కర్(10,122) కోహ్లీ కంటే ముందున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications