Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: 10 కేజీలు తగ్గాడు.. పాతరేస్తాడు!

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రీఎంట్రీలో దుమ్మురేపుతాడని అతని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన హిట్ మ్యాన్.. ఇప్పుడు ఆ బాధ్యతలు లేకుంటే మరింత రెచ్చిపోయి ఆడుతాడని జోస్యం చెబుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో పాత హిట్ మ్యాన్‌‌ను చూడటం ఖాయమని, అతని నుంచి రికార్డ్ డబుల్ సెంచరీలు చూస్తామని కామెంట్ చేస్తున్నారు.

కెప్టెన్సీ కోల్పోయినా.. జట్టులో కొనసాగేందుకు రోహిత్ శర్మ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడని, ఫిట్‌నెస్‌పై కూడా ఫోకస్ పెట్టాడని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రోహిత్ 10 కేజీల బరువు తగ్గాడని, ఆసీస్ పర్యటనలో డబుల్ సెంచరీ లోడింగ్ అని, అతన్ని ఆపడం ఎవరి తరం కాదంటున్నారు.

Double Century Loading Fans Shut Down Rohit Sharma Critics Ahead of Australia Tour

మరోవైపు ఈ సిరీస్‌లో రాణిస్తేనే రోహిత్ శర్మ టీమిండియాలో కొనసాగనున్నాడు. లేదంటే జట్టులో చోటు కోల్పోయి ఆటకు వీడ్కోలు పలకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 గెలవడమే తన లక్ష్యమని రోహిత్ తెలిపాడు. కానీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రోహిత్ శర్మను వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు.

వన్డే ప్రపంచకప్ 2027లో రోహిత్ శర్మ ఆడటం సందేహంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం వన్డే ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని కెప్టెన్సీ మార్పు చేశామని చెప్పాడు. ఆటగాడిగా రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగడం కష్టమే అనిపిస్తోంది. వన్డే ప్రపంచకప్‌కు మరో రెండేళ్ల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో టీమిండియా 7 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్‌లతోనే రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ ఆడటం కష్టం. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెరీర్‌ ముగింపు దశకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వన్డే షెడ్యూల్..

తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు

Story first published: Tuesday, October 7, 2025, 16:51 [IST]
Other articles published on Oct 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+