IND vs AFG: టీమిండియాకు గుడ్ న్యూస్.. లయన్స్ ఈజ్ బ్యాక్!
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాలతో ఇబ్బంది పడిన ఈ ఇద్దరూ.. ఫిట్‌నెస్ పరీక్షను నెగ్గారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ధృవీకరించింది.
'హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్దమయ్యారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యారు. ఇద్దరూ త్వరలోనే జట్టుతో కలుస్తారు. తొలి వన్డే నుంచే జట్టుకు అందుబాటులో ఉంటారు.’అని ఓ అధికారి మీడియాకు తెలిపారు.

ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్..
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గాయాలతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి గురవ్వగా.. హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ గాయాలతో ఈ ఇద్దరూ ముంబై తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు. ఆ తర్వాత కోలుకొని ఈ ఇద్దరూ బరిలోకి దిగినా.. వారు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి అవసరం ఉందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. దాంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరి రిహాబిలిటేషన్ తీసుకోవడంతో పాటు ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశారు.
కోహ్లీ దూరం..
మరోవైపు విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో అతను ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతని స్థానంలో సెలెక్టర్లు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేశారు. కోహ్లీ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. జూన్ 13న ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి వన్డే జరగనుండగా.. రెండో వన్డే 17న లక్నోలో.. చివరి వన్డే 20న చెన్నై వేదికగా జరగనుంది.
భారత వన్డే జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications