ఇంగ్లండ్‌పై ఐసీసీ కఠిన చర్యలు.. డబ్ల్యూటీసీలో 12 పాయింట్లు కోత! ఎందుకంటే?
ఇంగ్లండ్ టెస్ట్ టీమ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కారణమైన ఇంగ్లండ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌లో 12 పాయింట్లను తగ్గించింది.
ఇప్పటికే పర్సంటేజి తగ్గగా.. పాయింట్లలోనూ భారీ కోత పడటంతో ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. అద్భుతం జరిగితే తప్పా ఇంగ్లండ్ ఫైనల్ చేరలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.
12 ఓవర్లు తక్కువగా వేయడంతో..
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఈ జట్టు పర్సంటేజీ 34.72 నుంచి 26.38 శాతానికి పడిపోయింది.
అయితే రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ నిర్ణీత సమయం కంటే ఏకంగా 12 ఓవర్లు తక్కువ వేసింది. దాంతో ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున 12 పాయింట్లను కోత విధించింది. దాంతో పాయింట్ల సంఖ్య 50 నుంచి 38కి పడిపోయింది. కెప్టెన్‌గా వ్యవహరించిన జోరూట్‌తో పాటు సహచరులందరికీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా పడింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

రూల్స్ ప్రకారం చర్యలు..
'కనీస ఓవర్ రేటు ఉల్లంఘనలకు సంబంధించిన ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం... కేటాయించిన సమయం లోపు జట్టు బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు గానూ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. అయితే ఈ గరిష్ట జరిమానా పరిమితి మ్యాచ్ ఫీజులో 50 శాతానికి మించకూడదు.'అని ఐసీసీ పేర్కొంది.
నైట్ క్లబ్ ఉదంతంతో రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మూడో టెస్ట్ ఆడే ఇంగ్లండ్ జట్టును ఈసీబీ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ తిరిగొచ్చాడు. జూన్ 25 నుంచి నాటింగ్‌హామ్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌కు ఘోర పరాజయం..
రెండో టెస్ట్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ 291 పరుగులే చేయడంతో 100 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 362 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లండ్ ముందు 463 పరుగుల భారీ లక్ష్యం నమోదు కాగా.. ఇంగ్లండ్ 209 పరుగులకు ఆలౌటై 253 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications