IND vs NZ: సిరాజ్ X కాన్వే డిష్యూం డిష్యూం.. డీఎస్పీ అంటూ గవాస్కర్ కామెంట్స్!(వీడియో)
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిరాజ్ తన మాటలతో కాన్వేను కవ్వించే ప్రయత్నం చేశాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో కాన్వే బౌండరీ బాదాడు. దాంతో సహనం కోల్పోయిన సిరాజ్.. తన మాటలతో కాన్వేను కవ్వించే ప్రయత్నం చేశాడు. కాన్వే మాత్రం మౌనంగా ఉంటూ తన ఆటతోనే బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న స్లెడ్జింగ్‌ను విరాట్ కోహ్లీ ఆస్వాదించాడు. మరోవైపు ప్రేక్షకులు రెండు వర్గాలు విడిపోయారు. సిరాజ్‌కు మద్దతుగా డీఎస్పీ.. డీఎస్పీ.. అని గట్టిగా అరవగా.. కాన్వేకు మద్దతుగా సీఎస్‌కే అంటూ మరికొందరు అరిచారు.

ఇదే సమయంలో ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్..తన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు. సిరాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) అనే విషయం మరవద్దని తెలిపాడు. 'సిరాజ్ ఇప్పుడు డీఎస్పీ అనే విషయం మరిచిపోవద్దు.'అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 పోస్టింగ్ కింద డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. ఇటీవలే తెలంగాణ డీజీపీ జితేందర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారుల సమక్షంలో సిరాజ్ డీఎస్పీ నియామక పత్రాలను అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లలో 46 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(49 బంతుల్లో 2 ఫోర్లతో 20), యశస్వి జైస్వాల్(63 బంతుల్లో ఫోర్‌తో 13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/15), విలియమ్ ఓ రౌర్కే(4/22), టీమ్ సౌథీ(1/8) భారత్ పతనాన్ని శాసించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియాకు ఇదే లోయేస్ట్ స్కోర్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది.
క్రీజులో రచిన్ రవీంద్ర(22 బ్యాటింగ్)తో పాటు డారిల్ మిచెల్(14 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. టామ్ లాథమ్(15) విఫలమైనా.. డెవాన్ కాన్వే(91), విల్ యంగ్(33) రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేలా తలో వికెట్ తీసారు.
Siraj telling his real Instagram I'd to Conway pic.twitter.com/OMTZbP4VSY
— John_Snow (@MrSnow1981) October 17, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications