న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బీసీసీఐ సెలక్టర్లు.. సూర్యకుమార్ రికార్డులు చూడండి!! టీమిండియాకు ఎంపికవ్వాలంటే ఇంకా ఏంచేయాలి'

Don’t no what else Suryakumar Yadav has to do: Harbhajan Singh Slams BCCI Selectors

ముంబై: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు ఖరారైంది. సోమవారం వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా సమావేశమైన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ టెస్టులు, వన్డేలు, టీ20లకు వేర్వేరు జట్లను ప్రకటించింది. ఐపీఎల్‌ 2020లో గాయపడిన స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ, సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లను జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు. ఐపీఎల్‌లో రాణిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ20ల్లో చోటు దక్కించుకోగా.. ఫామ్ నిరూపించుకున్న రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్ తిరిగి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఇదే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం చోటు దక్కలేదు.

సూర్యకుమార్ యాదవ్‌కు మొండిచేయి

ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడిన సూర్య కుమార్ యాదవ్ 31.44 యావరేజ‌్, 148.94 స్ట్రైక్ రేట్‌తో 283 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 79 నాటౌట్. మొత్తంగా 196 ఐపీఎల్ మ్యాచులు ఆడిన సూర్య 1831 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2020లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న వరుణ్‌ చక్రవర్తికి అవకాశం ఇచ్చిన బీసీసీఐ సెలక్టర్లు.. సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున బీసీసీఐ సెలక్షన్ బృందంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ట్విట్టర్ వేదికగా బీసీసీపై సెటర్లు వేశాడు. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ అంటూ మండిపడ్డారు.

ఒక్కొక్కరికి ఒక్కో రూల్:

ఒక్కొక్కరికి ఒక్కో రూల్:

'టీమిండియా జట్టుకు ఎంపిక కావాలంటే సూర్యకుమార్ యాదవ్ ఇంకేం చేయాలో తెలీదు. ప్రతి ఐపీఎల్, రంజీ సీజన్లలలో అతడు సూర్యకుమార్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఉందనుకుంటా. బీసీసీఐ సెలక్టర్లు అతడి రికార్డులను చూడాలని కోరుతున్నా' అని టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. ఆసీస్ పర్యటన కోసం భారత జట్టును ప్రకటించగానే.. సూర్యకుమార్ యాదవ్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది. అతడికి చోటు దక్కితే బాగుండేదని పలువురు అభిమానులు, మాజీలు అభిప్రాయపడుతున్నారు.

యాదవ్‌ను విస్మరించారు

యాదవ్‌ను విస్మరించారు

ప్రస్తుతం ట్విట్టర్ ఖాతాలో సూర్యకుమార్ యాదవ్ పేరు ట్రెండ్ అవుతోంది. అంతేకాదు సూర్యకుమార్ ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. 'బీసీసీఐ సెలెక్టర్లు మరోసారి సూర్యకుమార్ యాదవ్‌ను విస్మరించారు' అని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. దీనికి సూర్యకుమార్ ఇంతకుముందు చేసిన ట్వీట్ జత చేశాడు. ఆ ట్వీటులో 'భారత జట్టును ప్రకటించిన ప్రతిసారి నాన్న అన్ని వెబ్ సైట్లు చూసి.. జట్టులో నీ పేరు లేదని నాకు కాల్ చేస్తాడు. అది పెద్ద సమస్యే కాదని నేను బదులిస్తుంటా' అని ఉంది. 'సూర్యకుమార్‌కు టీమిండియాకు ఎంపికయ్యే అర్హత ఉన్నా.. మరోసారి అవకాశం కోల్పోయాడు' అని ఇంకో అభిమాని కెమెంట్ చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న సూర్యకుమార్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిసున్నాడు. అంతేకాదు సూర్యకుమారే ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్‌.

ఐపీఎల్ 2021లో భారీ మార్పులు.. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ మార్పుపై చెన్నై సీఈవో ఏమన్నాడంటే?

Story first published: Tuesday, October 27, 2020, 14:25 [IST]
Other articles published on Oct 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X