న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Dominic Drakes వీడు కర్ణ్ శర్మ కంటే లక్కీ ప్లేయర్.. రెండు సీజన్లు రెండు టైటిళ్లు! ఒక్క మ్యాచ్ ఆడకుండానే..!

Dominic Drakes Wins 2 IPL Seasons For CSK And GT With Out Playing An Single Match In The Season

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ గుజరాత్ టైటాన్స్ గెలుచుకోవడంతో వెస్టిండీస్ యువ పేసర్ డొమినిక్ డ్రేక్స్ పేరు చర్చనీయాంశమైంది. ఈ సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్ ఆడకున్నా.. అతని పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ మారింది. ఎందుకంటే అతను వరుసగా రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే చాంపియన్‌గా నిలిచాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిథ్యం వహించిన డొమినిక్ డ్రేక్స్.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ చెన్నై టైటిల్ గెలిచింది.

ఒక్క మ్యాచ్ ఆడకున్నా..

ఒక్క మ్యాచ్ ఆడకున్నా..

మెగా వేలానికి ముందు అతన్ని చెన్నై వదులుకోగా.. రూ.కోటి 10 లక్షలకు గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది. టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఒక్క మ్యాచ్ ఆడకున్నా గుజరాత్ టైటిల్ గెలిచింది. దాంతో అతను ఐపీఎల్ లక్కీ స్టార్ అంటూ అభిమానులు కితాబిస్తున్నారు. భారత వెటరన్ స్పిన్నర్‌ కర్ణ్ శర్మకు ఐపీఎల్‌లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అయితే డొమినిక్ డ్రేక్స్ అతనికి మించిన లక్కీ ప్లేయర్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మూడు టైటిల్స్..

మూడు టైటిల్స్..

కర్ణ్ శర్మ ప్రాతినిథ్యం వహించిన జట్లు టైటిల్ గెలుచుకున్నాయి. అతను జట్టు మారిన ప్రతీసారి ఆయా టీమ్స్ విజేతలుగా నిలిచాయి. ఎంతలా అంటే గత ఐదు సీజన్లలో మూడు సార్లు చాంపియన్స్‌గా నిలిచిన జట్లలో కర్ణ్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలిసారి టైటిల్ విన్నర్‌గా నిలిచిన కర్ణ్ శర్మ.. 2017‌లో ముంబై ఇండియన్స్ తరఫున రెండోసారి.. 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు.

 ఆర్‌సీబీ దరిద్రం ముందు..

ఆర్‌సీబీ దరిద్రం ముందు..

అయితే ఈ సారి మాత్రం అతడి అదృష్టం ఆర్‌సీబీ దరిద్రం ముందు చేతులెత్తేసింది. ఈ సీజన్‌లో అతను అర్‌సీబీ ప్రాతినిథ్యం వహించడంతో ఆ జట్టు టైటిల్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ క్వాలిఫయర్2 మ్యాచ్‌లో ఆర్‌సీబీ.. రాజస్థాన్ చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది. కర్ణ్ శర్మ కనీసం ఒకటో,రెండో మ్యాచ్‌లు ఆడితే ఆయా జట్లు టైటిల్స్‌ గెలిస్తే.. డ్రాక్స్ మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడకుండా రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. దాంతో కర్ణ్ శర్మకు మించినోడు డ్రాక్స్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, May 31, 2022, 17:21 [IST]
Other articles published on May 31, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X