Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్గాన్-ఏపై ఘన విజయం.. ఫైనల్‌కు భారత్-ఏ!

ముక్కోణపు వన్డే సిరీస్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్-ఏ అదరగొట్టింది. అఫ్గానిస్థాన్-ఏతో బుధవారం జరిగిన మ్యాచ్ సమష్టిగా రాణించిన భారత్-ఏ 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. స్పిన్ ఆల్‌రౌండర్ నిషాంత్ సింధు(4/31) నాలుగు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ భారీ విజయంతో ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌కు ఫైనల్ బెర్త్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య(42 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 58), తిలక్ వర్మ(75 బంతుల్లో 5 ఫోర్లతో 59), కుమార్ కుశాగ్ర(67 బంతుల్లో 5 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38), రుతురాజ్ గైక్వాడ్(31 బంతుల్లో 4 ఫోర్లతో 30), విప్రజ్ నిగమ్(20 బంతుల్లో 4 ఫోర్లతో 30) పర్వాలేదనిపించారు. అఫ్గాన్-ఏ బౌలర్లలో ఫరిదూన్, అబ్డుల్లా అహ్మద్‌జై , ఫర్మనుల్లా రెండేసి వికెట్లు తీయగా.. జహీర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

Dominant India A Crush Afghanistan A by Massive Margin to Secure Tri-Nation Series Final Berth

అనంతరం అఫ్గానిస్థాన్-ఏ 36.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. బహీర్ షా(52 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫైసల్(56 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 46) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో నిశాంత్ సింధు(4/31)తో పాటు యశ్ ఠాకూర్(2/48) రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, విప్రజ్ నిగమ్, సూర్యాన్ష్ షెడ్గే, అనుకుల్ రాయ్ తలో వికెట్ తీసారు.

ఈ ముక్కోణపు సిరీస్‌లో 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచిన భారత్ మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ మధ్య జరిగే ఆఖరి మ్యాచ్ ఫలితంతో ఈ సిరీస్ ఫైనలిస్ట్‌లు ఎవరనేది తేలనుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్-ఏ ఓడితే భారత్-ఏ, శ్రీలంక-ఏ ఫైనల్లో తలపడనున్నాయి. అఫ్గానిస్థాన్-ఏ గెలిస్తే.. మెరుగైన రన్ రేట్‌ ఉన్న జట్లకు ఫైనల్ బెర్త్ దక్కనుంది. భారత్‌కు మెరుగైన రన్‌రేట్ ఉన్న నేపథ్యంలో ఫైనల్ బెర్త్ ఖరారు అయింది.

Story first published: Wednesday, June 17, 2026, 18:10 [IST]
Other articles published on Jun 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+