Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli- Anushka Sharma బాడీ గార్డ్ సాలరీ ఎంతో తెలుసా?

Do you Know Virat Kohli and Anushka Sharma’s bodyguard’s salary?

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మెయింటేన్ చేస్తారన్న విషయం తెలిసిందే. పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఇతరుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా వీరు సెలబ్రిటీలను రక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు కూడా బాడీ గార్డ్‌ను మెయింటేన్ చేస్తున్నారు. మొదట అనుష్క శర్మ పర్సనల్ బాడీగార్డ్‌గా ఉన్న అతను పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ‌కి కూడా సేవలందిస్తున్నాడు. అతని పేరు ప్రకాశ్ సింగ్ అకా సోను. ముద్దుగా సోను అని పిలుస్తుంటారు.

జీతం ఎంతంటే..?

జీతం ఎంతంటే..?

అయితే ఓ వెబ్‌సైట్ కథనం ప్రకారం సోను సేవలకు విరుష్క జోడీ భారీ మొత్తంలో వేతనం చెల్లిస్తుందంట. అతనికి చెల్లించే జీతం ముందు ప్రముఖ కంపెనీల సీఈవో కూడా పనికిరారట. సోను సేవలకు అనుష్క-కోహ్లీ జోడీ సంవత్సరానికి అక్షరాల రూ.1.2 కోట్లు సాలరీ ఇస్తున్నారంట. అంటే నెలకు 8 లక్షల 50 వేలు అన్నమాట. ఇదే నిజమైతే భారత్‌లో చాలా మంది కంపెనీల సీఈవోలకు ఇచ్చే జీతం కన్నా ఇది చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాడీ గార్డ్‌కు అంత జీతమా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లు సంపాదించే వారకి ఇదో లెక్కనా? అని మరికొంతమంది అంటున్నారు. బాడీ గార్డ్ ఉద్యోగం చేసినా బాగుండని మరికొంతమంది నిట్టూరుస్తున్నారు.

ఓ కుటుంబ సభ్యుడిగానే..

ఓ కుటుంబ సభ్యుడిగానే..

ఇక సోనూను విరుష్క జోడీ బాడీ గార్డ్ కంటే తమ కుటుంబ సభ్యుడిగానే ట్రీట్ చేస్తోంది. ఎన్నోసార్లు అతని బర్త్‌డే వేడుకులను కూడా ఈ జోడీ సెలబ్రేట్ చేసింది. షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటించి జీరో సినిమా షూటింగ్ సందర్భంగా కూడా అనుష్క.. సోనూ బర్త్‌డే వేడుకలు జరిపింది. ఇక అనుష్క ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా సోనూ కుటుంబ సభ్యుడిగా ఆమెకు సేవలందించాడు. కరోనా టైమ్‌లో పీపీఈ కిట్స్ ధరించి ఆమెకు రక్షణగా నిలిచాడు. ఇప్పుడు అతని బాధ్యత రెట్టింపు అయ్యింది. విరుష్కల గారాల పట్టీ వామికాను కంటికి రెప్పాల కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇప్పటి వరకు ఆమె ఫొటోను రిలీజ్ చేయని నేపథ్యంలో కెమెరాల నుంచి కూడా రక్షించాల్సిన బాధ్యత సోనూపై ఉంది.

నాలుగో వివాహ వార్షికోత్సవం..

నాలుగో వివాహ వార్షికోత్సవం..

2017 డిసెంబర్ 11న వివాహాబంధంతో ఒక్కటైన విరుష్క.. శనివారం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ తన సతీమణి విరాట్ కోహ్లీ విషెస్ చెబుతూ కొన్ని ఫొటోలు పంచుకున్నారు. ఈ జర్నీలో తనకెంతో సపోర్ట్‌గా ఉన్న అనుష్కకు థ్యాంక్స్ చెప్పాడు. కూతురు వామిక పుట్టిన తర్వాత ఇది ఫస్ట్ యానివర్సరీ కావడం మరింత స్పెషల్ అయిందన్నాడు.

Story first published: Sunday, December 12, 2021, 18:43 [IST]
Other articles published on Dec 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+