Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బర్త్‌డే బాయ్ రవిశాస్త్రి స్టన్నింగ్ పెర్ఫామెన్స్ గురించి తెలుసా?

Do you Know Ravi Shastri magical 5 for 15 against Australia in 1991

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి నేడు(మే 28, బుధవారం) 58వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. టీమిండియా కోచ్‌గా కోహ్లీసేన విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్న శాస్త్రి ఆటగాడిగా కూడా అదరగొట్టాడు. అటు బంతితో ఇటు బ్యాట్‌తో ఇరగదీసాడు. అతని పేరు చెప్పగానే అందరికి 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన ఫీటే గుర్తుకువస్తుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో శాస్త్రి ఈ ఘనతనందుకున్నాడు.

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా శాస్త్రి అరుదైన ఫీట్ అందుకున్నాడు. అది కూడా బౌలింగ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాపై అదరగొట్టాడు. 1991లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శాస్త్రి ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఈ ఘనతను అందుకున్నాడు.

బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా 1991 డిసెంబర్ 8న జరిగిన వన్డే మ్యాచ్‌లో శాస్త్రి బంతితో ప్రత్యర్థులకు విశ్వరూపం చూపించాడు. 6.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన శాస్త్రి ధాటికి అప్పటి ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ స్టీవ్ వా, సీమన్ డన్నెల్, ఇయాన్ హీలీ, పీటర్ టేలర్, క్రైగ్ మెక్ డెర్మాట్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 208 పరుగులే చేయగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ శాస్త్రి ధాటికి 101 పరుగులకే కుప్పకూలింది.

Do you Know Ravi Shastri magical 5 for 15 against Australia in 1991

ఇక ఆల్‌రౌండర్‌గా, వ్యాఖ్యాతగా, టీమ్‌ డైరె​క్టర్‌గా, ప్రధాన కోచ్‌గా భారత క్రికెట్ చరిత్రలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్న రవిశాస్త్రికి సోషల్‌ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు రవిశాస్త్రికి విషెస్ తెలియజేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ, ఆర్సీబీ ఫ్రాంచైజీ ట్వీటర్ వేదికగా విషెస్ తెలిపింది.

'చాలా మంది ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కానీ కొంతమంది మాత్రమే ధైర్యంగా ఉంటారు. హ్యాపీ బర్త్‌డే రవి భాయ్‌' అంటూ కోహ్లీ ట్వీట్ చేయగా.. హ్యాపీ బర్త్‌డే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.

Story first published: Wednesday, May 27, 2020, 15:55 [IST]
Other articles published on May 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+