For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Simi Singh: ఐర్లాండ్ క్రికెట్‌లో భారతీయుడు.. 8వ స్థానంలో సెంచరీ చేసిన​ ఆ ఘనుడు మనోడే!

Do you Know Irelands Simi Singh is Indian, He is first cricketer to score ODI century batting at No 8

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి అజేయ సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్ సిమి సింగ్ మనోడే. అవును వన్డే క్రికెట్​ చరిత్రలోనే ఎనిమిది లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన తొలి క్రికెటర్​గా ఘనత వహించిన ఈ సిమీ సింగ్ మన భారతీయుడే. పంజాబ్‌లోని మొహాలీకి చెందిన సిమ్రన్ జిత్ సింగే ఈ సిమి సింగ్. క్రికెట్‌లో తనకు ఎదుగుదల లేదనే అసహనంతో హోటల్ మేనేజ్​మెంట్​ కోర్సు చేసేందుకు 2005లో సిమ్రన్ జిత్ సింగ్ ఐర్లాండ్​ వెళ్లాడు. దేశం మారినా.. క్రికెట్​పై తనకున్న అభిరుచి మాత్రం మారలేదు. చదువుతో పాటు క్రికెట్​ అకాడమీలో శిక్షణ తీసుకొని.. డబ్లిన్​లోని మలాహిడ్​ క్రికెట్​ క్లబ్​లో చేరాడు. అక్కడ ప్లేయర్‌గా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అక్కడే అతని దశ తిరిగింది.

 అజేయ సెంచరీతో..

అజేయ సెంచరీతో..

సిమీ సింగ్‌గా ఐర్లాండ్​ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-1తో సమం చేసింది. శుక్రవారం చివరిదైన మూడో వన్డేలో సఫారీ జట్టు 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. తొలుత సౌతాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 346 పరుగులు చేసింది. ఓపెనర్లు జానేమన్​ మలన్‌ (177 నాటౌట్‌), డికాక్‌ (120) భారీ శతకాలతో చెలరేగారు. చేజింగ్‌లో ఐర్లాండ్‌ 47.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఎనిమిదో స్థానంలో వచ్చిన సిమి సింగ్‌ (100 నాటౌట్‌) అజేయ సెంచరీతో సౌతాఫ్రికా విజయాన్ని ఆలస్యం చేశాడు.

సామ్ కరన్‌ను వెనక్కు నెట్టి..

సామ్ కరన్‌ను వెనక్కు నెట్టి..

ఎనిమిది లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన తొలి క్రికెటర్​గా ఘనత వహించిన సిమీ సింగ్.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్(95) వెనక్కు నెట్టాడు. భారత్‌తో పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సామ్ కరణ్ లోయరార్డర్‌లో వచ్చి 95 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ స్కోర్‌గా ఉండగా.. సిమి సింగ్ అధిగమించాడు. 2017లో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సిమీ సింగ్.. ఐర్లాండ్ తరఫున ఇప్పటి వరకు 30 వన్డేలు, 24 టీ20లు ఆడాడు.

పంజాబ్ తరఫున..

పంజాబ్ తరఫున..

సిమీ సింగ్ పంజాబ్ తరఫున అండర్ 14, అండర్ 17 క్రికెట్ ఆడాడు. 2004లో అతను అంతర్ జిల్లా అండర్ 17 చాంపియన్‌షిప్‌లో 725 రన్స్ చేశాడు. అంతేకాకుండా విజయవాడ వేదికగా 2001లో జరిగిన 46వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. నిలకడగా రాణించినా సిమికి అండర్ 19 పంజాబ్ జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత ఐర్లాండ్‌కు వెళ్లిన సిమీ.. అక్కడ క్రికెట్ ఆడేందుకు చాలా కష్టాలు పడ్డాడు. డబ్బుల కోసం కిరాణ షాపులో కూడా పనిచేశాడు. 12 ఏళ్ల పాటు ఐరీష్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తే అతను 2017లో ఐర్లాండ్ పౌరసత్వం లభించింది. దాంతో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.

 కళ్ల ముందు కష్టం..

కళ్ల ముందు కష్టం..

సెంచరీ తర్వాత ఇన్నాళ్లు పడ్డ తన కష్టమంతా గుర్తొచ్చిందని, ఎంతో భావోద్వేగానికి గురయ్యానని సిమి తెలిపాడు. 'ఇది నిజంగా ఓ అద్భుతమైన ఇన్నింగ్స్​. నేను సెంచరీ పూర్తి చేసిన తర్వాత.. నా క్రికెట్​ ప్రయాణం మొత్తాన్ని అవలోకనం చేసుకున్నాను. అంతర్జాతీయ కెరీర్​లో తొలి సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అన్రిచ్ నోర్జ్, షామ్సి, కేశవ్ మహారాజ్ వంటి టాప్ క్లాస్ అటాక్ కలిగిన సౌతాఫ్రికాపై సెంచరీ చేయడం చాలా సంతృప్తినిచ్చింది. నా స్ట్రైక్‌రేట్ కూడా బాగుంది. క్రీజులో కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం మొదలు పెట్టాను. ఈ మ్యాచ్‌లో కూడా 92/6 క్లిష్ట స్థితిలో బ్యాటింగ్ రాగానే సెటిల్ అవ్వడానికి టైమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత నా సహజ శైలిలో ఆడటం ప్రారంభించాను.'అని సిమి సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, July 18, 2021, 15:51 [IST]
Other articles published on Jul 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+