Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిరాజ్ సంచలన ప్రదర్శన.. బుమ్రాపై గవాస్కర్ విమర్శలు!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐదు మ్యాచ్‌లకు ఐదు ఆడి 23 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. వర్క్‌లోడ్‌‌పై ఉన్న అపోహను తొలిగించాడని చెప్పాడు. వర్క్‌లోడ్‌లో శారీరకం కంటే మానసికంగా బలంగా ఉండటం ముఖ్యమని సిరాజ్ చాటి చెప్పాడని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. సిరాజ్‌ను కొనియాడుతూనే.. బుమ్రా పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించాడు.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా ఈ సిరీస్‌లో మూడు టెస్ట్‌లు మాత్రమే ఆడాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను గవాస్కర్ చాలా రోజులుగా తప్పుబడుతున్నాడు. అన్ని మ్యాచ్‌లు ఆడలేనప్పుడు సిరీస్‌కు ఎంపిక చేయడం ఏంటని గతంలోనే ప్రశ్నించాడు. పూర్తి ఫిట్‌నెస్ ఉంటేనే జట్టులోకి తీసుకోవాలని, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరిట ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడాన్ని తప్పుబట్టాడు. తాజాగా సిరాజ్ ఐదు టెస్ట్‌లకు ఐదు టెస్ట్‌లు ఆడటంతో మరోసారి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Do Jawans Complain Sunil Gavaskar Slams Workload Management with Strong Army Analogy

సిరాజ్ అద్భుతం..

'టెస్ట్ ఫార్మాట్‌లో బౌలర్లే మ్యాచ్‌లు గెలిపిస్తారని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఎక్కువ పరుగులు చేస్తేనే సులువుగా విజయం దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో పరుగులు చేయకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కానీ, బౌలింగ్‌తోనూ అద్భుతాలు చేయవచ్చని సిరాజ్ చాటి చెప్పాడు. వర్క్‌లోడ్ అనే దానిని పక్కన పెట్టేసేలా సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం.

ఈ పదాన్ని భారత క్రికెట్ డిక్షనరీ నుంచి తొలగించాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. వరుసగా ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో సిరాజ్ సుదీర్ఘమైన స్పెల్స్ వేసాడు. కెప్టెన్ ఎప్పుడూ బంతి ఇచ్చినా కాదనకుండా బౌలింగ్ చేశాడు. అతని నుంచి ఆశించింది కూడా ఇదే. అందుకే ఒక్కోసారి వర్క్‌లోడ్ అనేది శారీరకంగా కంటే మానసికంగా చాలా ముఖ్యం. వర్క్‌లోడ్‌కు ప్రాధాన్యత ఇస్తే మైదానంలోకి అత్యుత్తమమైన ఆటగాళ్లను బరిలోకి దించలేం. అలాంటి పరిస్థితులు వస్తే మీరు ఒకటే మాట చెప్పాలి. నువ్వు దేశం కోసం ఆడుతున్నావు. అలాంటప్పుడు కండరాలు నొప్పులు, బాధలను మరిచిపోవాలి.

జవాన్లు ఇలానే ఉంటారా?

సరిహద్దుల్లో జవాన్లు ఇలాగే ఉంటారా? ఎప్పుడైనా చలిగా ఉందని ఫిర్యాదులు చేశారా? అక్కడ ఎలాంటి పరిస్థితులైనా సరే దేశం కోసం జీవితాలను త్యాగం చేస్తారు. అలాంటి ఆటగాళ్లు దేశం కోసం ఆడలేరా? రిషభ్ పంత్ విరిగిన కాలితో బ్యాటింగ్ చేశాడు. చిన్న చిన్న గాయాలకే పక్కన కూర్చోవాలని అనుకోవద్దు. భారత దేశ అంచనాలను మోస్తున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయంలో ఇతర బౌలర్లు.. సిరాజ్‌ను చూసి నేర్చుకోవాలి.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, August 5, 2025, 13:01 [IST]
Other articles published on Aug 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+