Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: పొట్టి బట్టల్లో దిశా పటాని.. డ్యాన్స్ ఆపేసిన బ్రాడ్‌కాస్టర్! (వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. కళ్లు చెదిరే విన్యాసాలతో పాటు దిశా పటాని ఆట.. శ్రేయా ఘోషల్, కరణ్ ఆజ్లా పాట.. నవ్వులు పూయించిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హోస్టింగ్‌తో ఐపీఎల్ 18 సీజన్‌కు తెరలేచింది. అయితే దిశా పటాని ప్రదర్శనను మధ్యలోనే ఆపేయడం అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

స్టేజిపై వైట్ కలర్ పొట్టి దుస్తుల్లో మెరిసిన దిశా పటాని.. తన డ్యాన్స్‌తో అభిమానులకు పిచ్చెక్కిచ్చింది. ఆమె డ్యాన్స్ ప్రారంభమైన కాసేపటికే బ్రాడ్‌కాస్టర్.. వేడుకలను చూపించడం ఆపేసింది. దిశా పటాని డ్యాన్స్‌ను నిర్వాహకులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ర్యాపర్ కరణ్ ఆజ్లా తన పాటలతో అభిమానులను అలరించాడు. దాంతో 10 ఫ్రాంచైజీలకు సంబంధించిన పాటలకు దిశా పటాని డ్యాన్స్ చేస్తుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. సాధారణంగా ఆరంభ వేడుకల్లో 10 ఫ్రాంచైజీలకు సంబంధించిన అభిమానులను ఆకట్టుకునేలా ఆరంభ వేడుకలను నిర్వహిస్తారు.

Disha Patani s Dance Performance Gets Cut Short at IPL 2025 Opening Ceremony Censored for Revealing Dress
Photo Credit: screen grab for JioHotstar

అయిదే దిశా పటాని కాస్ట్యూమ్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె డ్యాన్స్ ప్రదర్శనను ఆపేసినట్లు తెలుస్తోంది. శరీరం అంతా కనిపెంచేలా పొట్టి దుస్తుల్లో ఉండటంతో సెన్సార్ సమస్య తలెత్తుతుందని బ్రాడ్‌కాస్టర్ ఆమె ప్రదర్శనను అడ్డుకున్నట్లు అర్థమవుతోంది. ఐపీఎల్‌ వేడుకలను కోట్లాది మంది టీవీల్లో చూస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి చూసే వేడుకల్లో దిశా పటాని దుస్తులు అభ్యంతరంగా ఉండటంతోనే బ్రాడ్‌కాస్టర్.. ఆమె డ్యాన్స్ ప్రదర్శనను ఆపేసినట్లు అర్థమవుతోంది.

అయితే దిశా పటాని డ్యాన్స్‌ను మధ్యలో ఆపేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం తెలియక దిశా పటాని డ్యాన్స్ ఎందుకు ఆపేసారని బ్రాడ్‌కాస్టర్‌పై మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది.

Story first published: Saturday, March 22, 2025, 20:37 [IST]
Other articles published on Mar 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+