Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలని మేము ప్రయత్నిస్తుంటే.. ఇతరులు మాత్రం'

Disappointed yet again: Babar Azam reacts after England withdraws Pakistan tour

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి డబుల్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముందుగా న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకోగా.. సోమవారం ఇంగ్లండ్ టీమ్ కూడా (పురుషులు, మహిళలు) పాక్ టూర్‌ను రద్దు చేసుకుంది. దీంతో పాక్‌ పీసీబీకి మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఈ విషయంపై పాక్‌ బోర్డు సహా మాజీలు, ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. ఈ క్రంమలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తుంటే.. ఇతరులు మాత్రం కాదనుకుంటున్నారని విచారం వ్యక్తం చేశాడు.

మరోసారి నిరాశకు గురయ్యా

భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించడంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ట్విట్టర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'మరోసారి నిరాశే మిగిలింది. క్రికెట్ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తుంటే.. ఇతరులు మాత్రం కాదనుకుంటున్నారు. ఈ ఎదురుదెబ్బల నుంచి బయటపడి నిలదొక్కుకోవడమే కాకుండా మరింతగా అభివృద్ధి చెందుతాం. ఇన్ షా అల్లా' అని బాబర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. దీనికి పాక్ అభిమానులు తమ మద్దతు తెలుపుతున్నారు.

చాలా కోపంగా ఉంది

ఈసీబీపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌, మాజీ క్రికెటర్ రమీజ్‌ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ అవసరమైతే పాశ్చాత్య దేశాలు ఏకమవుతాయని, పరస్పరం సహకరించుకుంటాయన్నాడు. 'ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలను రద్దు చేసుకోవడంతో నిరాశకు గురయ్యా. అయితే ఇలా జరుగుతుందని ముందే ఊహించా.

ఎందుకంటే దురదృష్టం కొద్దీ ఈ పాశ్చాత్య దేశాలు ఏకమైపోతాయి. దాంతో ఒకరికి ఒకరు సహకరించుకుంటారు. భద్రతా కారణాలతో ఎవరైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ మాకు చాలా కోపంగా ఉంది. న్యూజిలాండ్‌ ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంగ్లండ్ అదే బాటలో నడిచింది' అని రమీజ్‌ రాజా పేర్కొన్నాడు.

మాతో పోటీపడేలా చేస్తాం

మాతో పోటీపడేలా చేస్తాం

రమీజ్‌ రాజా తన ట్విటర్‌లోనూ స్పందించాడు. 'ఇంగ్లండ్ బోర్డు తమ బాధ్యతల నుంచి తప్పుకుంది. అంతేకాదు అవసరమైన సమయంలో స్నేహపూర్వకమైన బోర్డుతో తమ క్రికెట్‌ అనుబంధానికి బీటలు వేసుకుంది. ఈసీబీ చర్యలు నన్ను నిరాశపరిచాయి. అయితే మేం ఎలాగైనా ఈ పరిస్థితుల నుంచి బయటపడతాం. ఇది పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఓ మేలుకొలుపు. పాక్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా తయారై.. ఇతర జట్లు కారణాలేవీ చెప్పకుండా మాతో పోటీపడేలా చేస్తాం' అని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త ఛైర్మన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

'Ventakesh Iyer అద్భుతం.. మేము ఇలాంటి బ్రాండ్ క్రికెటే ఆడాలనుకుంటున్నాం! కొన్నిసార్లు వారికి ఏదీ సరితూగదు'

హెచ్చరికలు వెలువడగానే

హెచ్చరికలు వెలువడగానే

ఐదు కీలక దేశాల (అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌) ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌ 'ఫైవ్‌ ఐస్‌' హెచ్చరికలు వెలువడగానే న్యూజిలాండ్‌ బృందం ఏమాత్రం ఆలోచించకుండా స్వదేశానికి బయల్దేరిందని సమాచారం తెలుస్తోంది. దూషాన్‌బేలో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు విషయం తెలిసిన వెంటనే.. న్యూజిలాండ్‌ ప్రధాని జసెండా అర్డెన్‌కు ఫోన్‌ చేసి మ్యాచ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నించారు.

కానీ ఫైవ్‌ఐస్‌ హెచ్చరికల నేపథ్యంలో జసెండా ఏమీ చేయలేకపోయారు. 4000 మంది పాక్‌ సైన్యం, ఎస్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసులను మోహరిస్తామన్నా కివీస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని సమాచారం. ప్రస్తుతం అన్ని దేశాల ప్లేయర్స్ ఐపీఎల్ 2021 ఆడుతుంటే.. పాక్ ఆటగాళ్లు మాత్రం ఆడడంలేదు. దాయాది దేశాల మధ్య ఉన్న గొడవల కారణంగానే వాళ్ళు ఐపీఎల్ ఆడడం లేదు. 2008 సీజన్ మాత్రమే ఆడారు.

Story first published: Tuesday, September 21, 2021, 18:37 [IST]
Other articles published on Sep 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+