'Ventakesh Iyer అద్భుతం.. మేము ఇలాంటి బ్రాండ్ క్రికెటే ఆడాలనుకుంటున్నాం! కొన్నిసార్లు వారికి ఏదీ సరితూగదు'

అబుదాబి: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై అతడు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడనన్నాడు. తాము అలాంటి బ్రాండ్ క్రికెటే ఆడాలనుకుంటున్నామని మోర్గాన్ తెలిపాడు. తమ జట్టులోని ఆటగాళ్ల ముందు కొన్నిసార్లు ఏదీ సరితూగదని పేర్కొన్నాడు.
అబుదాబి వేదికగా సోమవారం రాత్రి ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్లు శుభమన్ గిల్ (48; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10 ఓవర్లలోనే ఛేదించింది.

అదరగొట్టిన అయ్యర్
కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల మధ్యప్రదేశ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచులో అదరగొట్టాడు. శుభమన్ గిల్‌కు అండగా నిలిచి.. కేకేఆర్‌కు మంచి ఆరంభం ఇచ్చాడు. గిల్ ఉన్నంతసేపు కాస్త ఓపికగా ఆడిన అయ్యర్.. ఆపై టాప్ గేర్‌లోకి దూసుకుపోయాడు. ఈ క్రమంలోనే కొన్ని అద్భుతమైన క్రికెట్ షాట్‌లతో అలరించాడు. మొదటి మ్యాచ్ అయినా.. ఆర్‌సీబీ టాప్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ దశలో వరుస బౌండరీలతో అలరించాడు.
అయ్యర్ ఆట అందరిని ఆకట్టుకుంది. దాంతో సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వర్చువల్ విలేకరుల సమావేశంలో పాల్గొని పలు విషయాలపై స్పందించాడు.

ఇలాంటి క్రికెటే అవసరం
'వెంకటేశ్ అయ్యర్ ఆడిన విధానం అత్యద్భుతం. కొన్ని అద్భుతమైన క్రికెట్ షాట్‌లు ఆడాడు. క్రీజులో మంచి సమయం గడిపాడు. మా మేము అనుకున్న ఆరంభం దక్కింది. మేము ఆడాలనుకుంటున్న క్రికెట్ బ్రాండ్ ఇదే. ఖచ్చితంగా ఇలాంటి క్రికెటే మాకు అవసరం. దూకుడుగా ఉన్నప్పటికీ అయ్యర్ తన ఇన్నింగ్స్‌ని నియంత్రించుకోగలిగాడు. శుభమన్ గిల్‌తో అతని ప్రారంభ భాగస్వామ్యం బాగుంది. ఇలాంటి దూకుడైన క్రికెట్ ఈ ఫార్మాట్లో అవసరం. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నాయకత్వంలో ఆడటం గౌరవంగా భావిస్తున్నా. అతడు కుర్రాళ్లకు సహాపడుతున్నాడు' అని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.

చక్రవర్తి సూపర్
'ఆండ్రీ రస్సెల్‌తో బౌలింగ్ చేయించాలనే మా ప్రణాళికలు పనిచేశాయి. రస్సెల్ బాగా బంతులు వేశాడు. సీమర్‌లకు ఇన్నింగ్స్ ఆసాంతం పిచ్ సహకరించింది. పిచ్ సీమర్లకు అనుకూలించినా.. వరుణ్ చక్రవర్తి తానేంటో నిరూపించుకున్నాడు. వరుణ్‌కు నమ్మశక్యం కాని రోజు ఇది. అతడికి ఎప్పుడు బంతిని ఇచ్చినా.. రాణిస్తాడు' అని ఇయాన్ మోర్గాన్ చెప్పాడు. వరుణ్ చక్రవర్తి (3/13), ఆండ్రీ రస్సెల్ (3/9) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుణ్ నాలుగు ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టగా.. రస్సెల్ మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. తాజా విజయంతో కేకేఆర్ పట్టికలో ఐదవ స్థానానికి చేరుకుంది.

కొన్నిసార్లు ఏదీ సరితూగదు
'మా జట్టులోని ఆటగాళ్ల నైపుణ్యాలతో పోలిస్తే.. కొన్నిసార్లు ఏదీ సరితూగదు. మా టైమింగ్ కూడా బాగా కుదిరింది. ఏ ఆటగాడైనా బరిలోకి దిగి సత్తా చూపించాలి. ఈరోజు మా బౌలర్లు రాణించారు. గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ.. లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఐపీఎల్ 2021లో మేమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మేం ముందుకు సాగాలంటే.. చాలా విషయాలు కలిసిరావాలి. ఈరోజు మంచి ఆరంభం దక్కింది. ఈ ప్రదర్శనతో మేం ప్రమాదకర జట్టుగా ఎదిగే అవకాశం ఉంది. ప్లే ఆఫ్ చేరుందుకు ప్రయత్నిస్తాం' అని మోర్గాన్ ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
PBKS vs RR Dream11 Prediction: డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! ఫాంటసీ క్రికెట్ చిట్కాలు!!