పెద్ది సినిమాలో హార్దిక్ పాండ్యా ట్రేడ్ మార్క్ షాట్!(వీడియో)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన పెద్ది సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి హిట్‌గా నిలిచింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిగా నటించింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా గత గురువారమే విడుదలై బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు థియెటర్స్‌కు ఎగబడుతున్నారు.
క్రికెట్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో డైరెక్టర్ బుచ్చి బాబు అన్ని క్రికెట్ షాట్స్‌ను వాడేసాడు. హీరో రామ్ చరణ్ స్టార్ క్రికెటర్లు ఆడిన అన్ని షాట్స్‌ను అలవోకగా ఆడేసాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ట్రేడ్ మార్క్ షాట్‌ను రామ్ చరణ్ ఇరగదీసాడు.
గ్వాలియర్ వేదికగా 2024లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో హార్దిక్ పాండ్యా వికెట్ కీపర్ వెనుకాలకు ఈ ఎపిక్ నో లుక్ షాట్ ఆడాడు. బౌలర్ సంధించిన బౌన్సర్‌కు నిలబడి జస్ట్ బ్యాట్‌తో హుక్ చేస్తాడు.. బంతి కీపర్ వెనుకాల పడి బౌండరీకి వెళ్తుంది. కనీసం బంతి వైపు కూడా చూడకుండా ఆడిన ఈ నోలుక్ షాట్ అప్పట్లో అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఈ షాట్‌ను బుచ్చి బాబు పెద్ది సినిమాలో దింపేసాడు. రామ్ చరణ్‌తో ఈ నోలుక్ ట్రేడ్ మార్క్ షాట్ ఆడించాడు. థియేటర్‌లో ఈ సీన్‌ను చూసిన అభిమానులు పిచ్చెక్కిపోయారు. బుచ్చిబాబు ఈ షాట్‌ను బాగానే గుర్తు పెట్టుకున్నాడని, మనలానే క్రికెట్ పిచ్చోడని కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా, రామ్ చరణ్ ఆడిన షాట్స్‌ను ఒకే వీడియోలో ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రేడ్ మార్క్ షాట్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా వెన్ను నొప్పితో బాధపడిన హార్దిక్ పాండ్యా.. ఫిట్‌నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎంపికైనా.. అతను ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సెలెక్టర్లు తెలిపారు. ఇప్పటికీ అయితే హార్దిక్ బెంగళూరులోని క్రికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లలేదు. జూన్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications