For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ బాక్సింగ్ పంచ్ నా భర్త దినేశ్ కార్తీక్‌పై ప్రయోగిస్తా: దీపికా పల్లికల్

Dipika Pallikal jokes she will try ‘hook punch’ on Dinesh Karthik

ముంబై: బాక్సింగ్ హుక్ పంచ్‌ను తన భర్త, టీమిండియా క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌పై ప్రయోగిస్తానంటూ భారత స్క్వాష్‌ ప్లేయర్‌ దీపికా పల్లికల్‌ సరదాగా చెప్పుకొచ్చింది. వాచ్‌ అస్‌ మూవ్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమంలో భాగంగా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అడిగిన ప్రశ్నకు దీపిక ఈ విధంగా బదులిచ్చింది. ప్రముఖ సంస్థ అడిడాస్‌ నిర్వహించిన ఈ కార్యక్రమానికి దీపికా పల్లికల్‌తో పాటు 2017 మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌, ఇండియన్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది.

ఈ సందర్భంగా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తన ఫేవరెట్‌ షాట్‌ అయిన హుక్‌ పంచ్‌ను ప్రస్తావించిది. తాను ఆ పంచ్‌ను ఎలా ఉపయోగిస్తాననేది దీపికా, మానుషి చిల్లర్‌కు వివరించింది. ఈ నేపథ్యంలో ''దీపికా.. మీరు హుక్‌ పంచ్‌ను ఎవరిపై ప్రయోగిస్తారు'' అని నిఖత్‌ జరీన్‌ ప్రశ్నించగా... 'వేరే వాళ్లపై ప్రయోగిస్తే ఊరుకోరు కదా.. అందుకే నేను ఈరోజే నా భర్త కార్తీక్‌పై ప్రయోగిస్తా..'అని దీపికా బదులివ్వడం అక్కడున్న వారందరికి నవ్వు తెప్పించింది. ఇంటికి వెళ్లగానే కార్తీక్‌కు హుక్‌ పంచ్‌ గురించి వివరించి దానిని అమలు పరిచేలా చూస్తానని దీపికా తెలిపింది.

భారత స్క్వాష్‌ క్రీడాకారిణిగా ఎన్నో పతకాలు సాధించిన పల్లికల్‌ 2013లో క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ను పెళ్లాడింది. పల్లికల్ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మూడు.. ఏషియన్‌ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించింది. ఇక టీమిండియా తరఫున 2019లో చివరిసారిగా ఆడిన దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోసం సిద్ధమవుతున్నాడు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథ్య బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం కేకేఆర్‌ యాజమాన్యం ఇంగ్లండ్‌ ఆటగాడు ఇయాన్‌ మోర్గాన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. భారత్ తరపున ఇప్పటివరకు 94 వన్డేల్లో 1752 పరుగులు, 32 టీ20ల్లో 399 పరుగులు, 26 టెస్టుల్లో 1025 పరుగులు సాధించాడు.

Story first published: Friday, March 5, 2021, 15:07 [IST]
Other articles published on Mar 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+