ఆర్‌సీబీ అభిమానులనే కాదు.. ఆ రెండు జట్ల ఫ్యాన్స్ కోసం గెలుస్తాం: దినేశ్ కార్తీక్

కోల్‌కతా: తమ అభిమానుల కోసమే కాకుండా ప్లే ఆఫ్స్ చేరడంలో పరోక్ష సాయం అందించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కోసం విజయం సాధిస్తామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో నేడు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ క్వాలిఫయర్-2కి అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది.

ముంబై గెలుపుతోనే..
ఆర్‌సీబీ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడి.. 8 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. నెగటీవ్( -0.253) నెట్ రన్‌రేట్‌తో ఇంటిదారి పట్టేలా కనిపించిన ఆర్‌సీబీకి ముంబై ఇండియన్స్, చెన్నై పరోక్షంగా సాయం చేశాయి. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ అభిమానులతో పాటు.. ఈ రెండు జట్ల అభిమానుల ఆనందం కోసం ఎలిమినేటర్‌లో గెలుస్తామని ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ నెల 19న పట్టికలో నెం.1 స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో ఢీకొన్న బెంగళూరు టీమ్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

వారి ముఖాల్లో చిరునవ్వులు..
ఆ తర్వాత ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఇండియన్స్ టీమ్ 5 వికెట్ల తేడాతో ఓడించి ఇంటికి పంపించింది. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 91 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. దాంతో.. పాయింట్ల పట్టికలో నెం.4 స్థానానికి గట్టి పోటీదారుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ చివరికి ఐదో స్థానంలో నిలిచి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలోనే చెన్నై, ముంబై అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తామని కార్తీక్ తెలిపాడు.

వారి కోసం కచ్చితంగా గెలుస్తాం..
'పాయిట్స్ టేబుల్‌లో అగ్ర స్థానంలో ఉన్న గుజరాత్ జట్టుతో లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌ను ఆడి గెలిచాం. ఆ తర్వాత ప్లేఆఫ్స్ బెర్తు కోసం వెయిట్ చేశాం. పరిస్థితులు మాకు అనుకూలించాయి. ఐపీఎల్ చాలా గొప్ప టోర్నీ.. అలానే భావోద్వేగాల సమ్మేళనం. ఎట్టకేలకు మేం ప్లేఆఫ్స్‌కు చేరాం. ఇక కొంచెం జర్నీ మిగిలి ఉంది. ఆర్‌సీబీ అభిమానులే కాదు.. ముంబై, చెన్నై అభిమానుల కోసం ఎలిమినేటర్‌లో గెలుస్తాం.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications