రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పటి వరకు భారీ సిక్సర్ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఈ ఫీట్ సాధించాడు.
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా నటరాజన్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని నటరాజన్ ఫుల్‌టాస్ వేయగా.. దినేశ్ కార్తీక్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడాడు. అతని ధాటికి బంతి స్టేడియం బయట పడింది. 108 మీటర్ల భారీ సిక్సర్‌గా నమోదయ్యింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ సిక్సర్.

ఈ 108 మీటర్ల సిక్స్‌తో దినేశ్ కార్తీక్.. హెన్రీచ్ క్లాసెన్, వెంకటేశ్ అయ్యర్, నికోలస్ పూరన్ పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో క్లాసెన్, పూరన్, వెకంటేశ్ అయ్యర్ 106 మీటర్ల సిక్సర్ బాదారు. ఈ ముగ్గురు బ్యాటర్లు కూడా ఆర్‌సీబీపైనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. హెన్రీచ్ క్లాసెన్ ఇదే మ్యాచ్‌లో 106 మీటర్ల సిక్స్ బాదగా.. దినేశ్ కార్తీక్ 108 మీటర్ల దూరం కొట్టాడు.
ఈ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో దినేశ్ కార్తీక్(108), క్లాసెన్, పూరన్, వెకంటేశ్ అయ్యర్ (106) తర్వాత ఇషాన్ కిషన్(103 మీటర్లు), ఆండ్రీ రస్సెల్(102), అభిషేక్ శర్మ(99), ట్రావిస్ హెడ్(98) ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్సర్ రికార్డు అల్బీ మోర్కెల్ పేరిట ఉంది. 2008లో సీఎస్‌కే తరఫున బరిలోకి దిగిన అతను డెక్కన్ ఛార్జర్స్‌పై 125 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు.
అప్పటి నుంచి ఈ రికార్డు చెక్కుచెదరలేదు. 2008లో ఆర్‌సీబీ తరఫున ప్రవీణ్ కుమార్ 124 మీటర్ల సిక్సర్ కొట్టాడు. గిల్ క్రిస్ట్(122), రాబిన్ ఊతప్స(120), క్రిస్ గేల్(119), రాస్ టేలర్(119), యువరాజ్ సింగ్ 119 మీటర్ల సిక్స్‌తో తర్వాతి స్థానంలో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్.. టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది.