Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను జట్టుకు భారంగా మారాడు: దినేష్ కార్తీక్

టీమిండియా టీ20 వైస్ కెప్టెన్, తెలుగు తేజం తిలక్ వర్మపై మాజీ క్రికెటర్, ఆర్‌సీబీ మెంటార్ దినేష్ కార్తీక్ విమర్శలు గుప్పించాడు. తిలక్ వర్మ జట్టుకు భారంగా మారాడని, అతన్ని తొలగించి మరో ప్లేయర్‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు.

IND vs ENG: సిరీస్ సమర్పయామి.. నాలుగో టీ20లోనూ భారత్ ఓటమి!

IND vs ENG: సిరీస్ సమర్పయామి.. నాలుగో టీ20లోనూ భారత్ ఓటమి!

ఇంగ్లండ్ పర్యటనలో తిలక్ వర్మ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వరుసగా నాలుగు టీ20ల్లో 13, 24, 3, 11 పరుగులే చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ.. ఆ తర్వాత ఐదో స్థానానికి మారాడు. అప్పటి నుంచే తిలక్ వర్మ పతనం ప్రారంభమైంది.

Dinesh Karthik slams out-of-form Tilka Varma and Shivam Dube after IND vs ENG 4th T20I

జట్టుకు సమస్యగా మారాడు..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్‌లో పర్వాలేదనిపించిన తిలక్ వర్మ.. ఇండియా-ఏ కెప్టెన్‌గా శ్రీలంక పర్యటనలో సత్తా చాటాడు. ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 55 సగటుతో 275 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 టీ20 లీగ్ ఆరంభ మ్యాచ్‌లోనూ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కానీ ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఆ జోరును కొనసాగించలేకపోయాడు.

నాలుగో టీ20 పరాజయం అనంతరం టీమిండియా ప్రదర్శనపై ఓ స్పోర్ట్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. తిలక్ వర్మతో పాటు శివమ్ దూబేపై విమర్శలు గుప్పించాడు. 'టీమిండియాకు ఉన్న మరో సమస్య తిలక్ వర్మ. అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. భారత్-ఏ తరఫున కెప్టెన్‌గా వన్డే ఫార్మాట్‌లో సత్తా చాటినప్పటికీ టీ20 ఫార్మాట్‌లో ఆ జోరును కొనసాగించలేకపోతున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు.

IND vs ENG: తిలక్, ఇషాన్‌పై వేటు.. సంజూకు చోటు! ఆఖరి టీ20కి భారత జట్టు ఇదే!

IND vs ENG: తిలక్, ఇషాన్‌పై వేటు.. సంజూకు చోటు! ఆఖరి టీ20కి భారత జట్టు ఇదే!

తిలక్, దూబేపై వేటు..?

అతని తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే శివమ్ దూబే కూడా పరుగులు చేయలేకపోతున్నాడు. అతను మరీ దారుణంగా 100 కంటే తక్కువ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి టీమిండియా మేనేజ్‌మెంట్ బాగా ఆలోచించాలి. పరిస్థితులు ఎందుకు అనుకూలంగా లేవు? ఆకస్మాత్తుగా భారత జట్టు ఫామ్ కోల్పోవడానికి గల కారణాలు ఏంటనే విషయాలను తెలుసుకోవాలి.

అయితే ఆఖరి టీ20కి భారత తుది జట్టులో భారీ మార్పులు జరగవచ్చు. తిలక్ వర్మను తప్పిస్తారని నాకు అనిపిస్తోంది. అతని స్థానంలో మరో బ్యాటర్ ఆడవచ్చు. బహుషా సూర్యాన్ష్ షెడ్జేకు అవకాశం ఇవ్వవచ్చు. శివమ్ దూబేకు కూడా రెస్ట్‌ ఇచ్చి మరో బ్యాటర్‌ను ఆడించవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఖరి టీ20లో భారత్ ఓడిపోతే టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్‌ను కూడా కోల్పోతుంది.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, July 10, 2026, 15:59 [IST]
Other articles published on Jul 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+