ఆ సింగిల్ వల్లే భారత్ ఓడింది: దినేశ్ కార్తీక్
టీమిండియా గేమ్ ప్లాన్‌పై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ విమర్శలు గుప్పించాడు. మ్యాచ్‌పై భారత ఆటగాళ్లకు అవగాహన లోపించిందని, సోయి లేకుండా ఆడి ఓటమిపాలయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆఖరి ఓవర్‌లో హర్షిత్ రాణాకు తొలి బంతికే స్ట్రైక్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 1 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయ్యింది.
భారత్ విజయానికి ఆఖరి 7 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్ చివరి బంతిని అర్ష్‌దీప్ సింగ్ సింగిల్ తీసాడు. చివరి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీసినప్పటికీ.. భారత్ విజయం సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌పై మాట్లాడిన దినేశ్ కార్తీక్.. గేమ్‌పై భారత ఆటగాళ్లకు అవగాహన లోపించిందని అభిప్రాయపడ్డాడు.

'ఆఖరి ఓవర్‌లో హర్షిత్ రాణాకు స్ట్రైక్ ఇవ్వాల్సింది. అతను తొలి బంతికే సిక్స్ లేదా బౌండరీ బాది ఉంటే బౌలర్ హ్యారీ టెక్టర్‌పై మరింత ఒత్తిడి పెరిగి ఉండేది. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు గేమ్‌పై మరింత అవగాహన ఉండాలి. ముఖ్యంగా బ్యాటింగ్ చేసే సమయంలో కాస్త సంయమనం, తెలివితేటలు ప్రదర్శించాలి. భారత్ మంచి స్థితిలో కనిపించింది.
లక్ష్యాన్ని ఛేదించేలా దిశగా సాగారు. వారికి 7 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. అర్ష్‌దీప్, హర్షిత్ రాణా క్రీజులో ఉన్నారు. కానీ ఏం జరిగింది. 19వ ఓవర్ చివరి బంతికి అర్ష్‌దీప్ సింగ్ సింగిల్ తీసాడు. కానీ ఆఖరి ఓవర్ తొలి బంతికి హర్షిత్ రాణా లాంటి బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన ఆటగాడు స్ట్రైక్ తీసుకోవాలి. ఎందుకంటే అది బౌలర్‌పై ఒత్తిడిని పెంచుతుంది.
భారత్ ఆటగాళ్లు చిన్న చిన్న పొరపాట్లతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. ప్రపంచకప్ గెలిచిన జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలి. అరంగేట్ర మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతను కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసినప్పటికీ.. ఆ తర్వాత తన నైపుణ్యాలను ప్రదర్శించిన తీరు గొప్పగా ఉంది. 'అని దినేశ్ కార్తీక్ కొనియాడాడు.
చివరి ఓవర్‌లోనే ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జులై1న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

