చిందులేశారు..
తమ తోటి ఆటగాడికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ.5.25 కోట్లకు పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంతో బస్సులోనే కేరింతలు కొట్టారు. ఆ సంతోషకరమైన క్షణాలను తన మొబైల్‌లో షూట్ చేసిన టీమ్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ దాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకొన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది.
రూ.20లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ ఏకంగా రూ.5.25కోట్లకు కొనుగోలు చేసింది. అండర్19 ప్రపంచ కప్, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఇటీవల అతను మెరుపులు మెరిపించడంతో అందరి దృష్టిని ఆక్షరించాడు. ఈ నేపథ్యంలోనే షారుఖ్ కోసం ఇతర జట్లు పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడిన పంజాబ్ కింగ్స్ చివరికి అతన్ని భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
వెంటాడిన దురదృష్టం..
ఇక పంజాబ్‌కు గత సీజన్‌లో దురదృష్టం వెంటాడింది. చాలా వరకు గెలిచే మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. సెకండాఫ్‌లో వరుస విజయాలతో రేసులోకి వచ్చినా.. ఆ జోరును కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో హిట్టింగ్ చేసే బ్యాట్స్‌మన్ లేక పలు ఓటములు చవిచూసింది. ఈ క్రమంలోనే ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 8 ఓటములతో ఆరో స్థానంలో నిలిచింది. దాంతో ఈ సీజన్‌కు పంజాబ్ కింగ్స్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది.

పంజాబ్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
రిచర్డ్‌సన్ (రూ.14 కోట్లు), మెరెడిత్ (రూ.8 కోట్లు), షారుఖ్ ఖాన్ (రూ.5.25 కోట్లు), హెన్రిక్స్ (రూ.4.20 కోట్లు), మలన్ (రూ.1.50 కోట్లు) ఫాబియాన్ అలెన్ (రూ.75 లక్షలు), జలజ్ సక్సేనా (రూ.30 లక్షలు), సౌరభ్ కుమార్ (రూ.20 లక్షలు), ఉత్కర్ష్ (రూ.20 లక్షలు)

పంజాబ్ కింగ్స్ పూర్థిస్థాయి జట్టు..
కేఎల్ రాహుల్(కెప్టెన్), డేవిడ్ మలాన్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మన్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నికోలస్ పూరన్(కీపర్), సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్, మొయిసెస్ హెన్రీక్స్, మహ్మద్ షమీ, జలజ్ సక్సెనా, ఉత్కర్ష్ సింగ్, సౌరభ్ కుమార్, ఫాబియన్ అలెన్


Click it and Unblock the Notifications
