అతని వల్లే సిరాజ్ ఈ స్థాయిలో ఉన్నాడు.. ఓ తమ్ముడిలా చూసుకున్నాడు: దినేశ్ కార్తీక్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కారణంగానే పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ స్థాయిలో ఉన్నాడని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. గడ్డు పరిస్థితుల్లో సిరాజ్‌కు కోహ్లీ అండగా నిలిచాడని గుర్తు చేశాడు.
ఈ హైదరాబాద్ పేసర్‌ను కోహ్లీ ఓ తమ్ముడిలా ట్రీట్ చేస్తాడని చెప్పాడు. టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందివ్వడంలో కోహ్లీ విఫలమైనా.. జట్టుకు మంచి ఆటగాళ్లను అందించాడని కార్తీక్ తెలిపాడు. రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ సూర్యకుమార్ యాదవ్‌లు కోహ్లీ సారథ్యంలోనే అరంగేట్రం చేశారని గుర్తు చేశాడు.

అరంగేట్రం ఓ పీడకలా..
2017లో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన సిరాజ్.. దారుణంగా విఫలమయ్యాడు. 53 పరుగులు సమర్పించుకొని అరంగేట్ర మ్యాచ్‌ను ఓ పీడకలలా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లీ అతనికి అండగా నిలిచాడు. ఐపీఎల్‌లో ధారళంగా పరుగులిచ్చినా.. ప్రతీ సీజన్‌లో జట్టుతోనే అంటిపెట్టుకున్నాడు. 2021 ఆస్ట్రేలియా పర్యటన సిరాజ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అక్కడి నుంచి అతను వెనక్కి చూసుకోలేదు. తాజాగా క్రిక్‌బజ్ స్పెషల్ షో'రైస్ ఆఫ్ న్యూ ఇండియా'లో సిరాజ్ గురించి మాట్లాడిన దినేశ్ కార్తీక్.. అతని సక్సెస్‌లో కోహ్లీ పాత్ర గురించి తెలిపాడు.

కోహ్లీ లేకుంటే..
'కరోనా బీభత్సానికి ముందు మహమ్మద్ సిరాజ్ పేలవ ఫామ్‌తో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు ఆర్‌సీబీ అతన్ని వదులుకునే ప్రయత్నం చేయగా విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. అతను తుది జట్టులో ఉండాలని పట్టుబట్టాడు. ఆ మద్దతులో 2020 సీజన్‌లో సిరాజ్ దుమ్మురేపాడు. అప్పుడు నేనే కేకేఆర్ టీమ్‌కు ఆడుతున్నాను. సిరాజ్ సంచలన బౌలింగ్‌తో చెలరేగడంతో మేం 100 పరుగులు కూడా చేయకుండా ఆలౌటయ్యాం. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

ఓ తమ్ముడిలా..
ఆ క్షణమే అతని టీ20 కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి అతను అద్భుతంగా రాణించాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన విధానం అద్భుతం. అతని జర్నీ ప్రతీ ఒక్కరికి స్పూర్తిదాయకం. సిరాజ్‌ను విరాట్ కోహ్లీ ఓ తమ్ముడిలా ట్రీట్ చేస్తాడు. ఓ గైడ్‌గా అతనికి అండగా నిలిచాడు. గడ్డు పరిస్థితుల్లోనూ సిరాజ్‌కు కోహ్లీ అండగా ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే అతను జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. సిరాజ్ కూడా తన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిగా కోహ్లీని కీర్తిస్తాడు.

భరత్ అరుణ్ సైతం..
నాకు తెలిసి అతని జీవితంలో ఇద్దరూ విలువైన వ్యక్తులున్నాయి. కోహ్లీతో పాటు భరత్ అరుణ్ కూడా అతని సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాడు. కెరీర్ ఆరంభంలో సిరాజ్‌కు అండగా నిలిచింది భరత్ అరుణే. కోహ్లీకి పరిచియం చేసింది కూడా అతనే. హైదరాబాద్ కోచ్‌గా ఉన్నప్పుడే సిరాజ్ ప్రతిభను గుర్తించి అతనికి మెళకువలు నేర్పాడు. కోచ్‌గా సిరాజ్‌కు భరత్ అరుణ్ అండగా నిలిస్తే.. కెప్టెన్‌గా కోహ్లీ మద్దతు ఇచ్చాడు.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications