అందుకే శిఖర్ ధావన్‌పై టీమ్‌మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపుతోంది: దినేశ్ కార్తీక్

న్యూఢిల్లీ: టీమిండియా తాత్కలిక వన్డే కెప్టెన్ శిఖర్ ధావన్‌పై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్‌గా ధావన్ బరిలోకి దిగుతాడని చెప్పాడు. అతను సెలెక్టర్లకు గొప్ప ఎంపిక అవుతాడని, ప్రపంచకప్ జట్టులో ఓపెనర్‌గా రాణించేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపాడు. శిఖర్ ధావన్‌ను టీ20 ఫార్మాట్‌కు దూరం పెట్టిన సెలెక్టర్లు వన్డే ఫార్మాట్‌లో మాత్రం వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.
న్యూజిలాండ్ పర్యటనకు కూడా కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయం ఉండగా.. కొత్త సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. కాబట్టి ధావన్ ప్రపంచకప్ జట్టులో ఉంటాడని చెప్పడం కష్టమే. అయితే దినేశ్ కార్తీక్ మాత్రం అతను ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

శిఖర్ ధావనే ఓపెనర్..
'నాకెందుకో రానున్న ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్ ఓపెనర్‌గా ఆడతాడని అనిపిస్తోంది. ఎందుకంటే ముప్పై ఏళ్లు దాటిన ఈ ఆటగాడిని పక్కనపెట్టడం చాలా తేలిక. కానీ, సెలెక్టర్లు అతని చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వడానికి సైతం వారు ఆసక్తి చూపారు. అతను సందర్భానికి తగినట్లుగా తనను తాను మలచుకునే వ్యక్తి. ఆటలో స్థిరత్వం చూపుతాడు.

ఐపీఎల్‌తో చాన్స్..
2019 ప్రపంచకప్ సమయంలోనూ గాయానికి ముందు అతను ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒక్కసారిగా అతను తన ఫామ్‌ను కోల్పోతే తప్ప.. జట్టులో కొనసాగడానికి పూర్తిగా అర్హుడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా ధావన్ నమ్మదగిన వ్యక్తి. ఎందుకంటే, అతనికి గేమ్ ప్లాన్ తెలుసు. క్రీజును చక్కగా ఉపయోగించుకుంటాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఐపీఎల్‌కు ముందు అతను కోరుకుంటున్నట్టుగా మరో మంచి అవకాశం దొరుకుతుంది'అని దినేశ్ కార్తీక్ తెలిపాడు.

పంజాబ్ కెప్టెన్‌గా
టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికవ్వడానికి ముందే ధావన్‌ను ఐపీఎల్ 2023లో పంజాబ్ జట్టు కెప్టెన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతని నేతృత్వంలో భారత్ న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడుతోంది. అయితే, తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో వర్షం రూపంలో ఆటంకం ఎదురైంది. ఇక ఈ సిరీస్‌లో ఎంతో కీలకమైన మూడో వన్డే క్రైస్ట్‌చర్చ్ వేదికగా బుధవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications