న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ విషయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బెస్ట్: దినేశ్ కార్తీక్

Dinesh Karthik Says KKR is the best when it comes to handling of players

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆటగాళ్లను సమన్వయం చేసే విషయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బెస్ట్ అని ఆ టీమ్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అన్నాడు. గెలుపోటములను కూడా అదే తరహాలో స్వీకరిస్తారని తెలిపాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టు కో-ఓనర్ షారూక్ ఖాన్ కారణంగా తొలుత క్రేజ్ సంపాదించుకున్న కేకేఆర్.. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచి ఆ ఆదరణని మరింత పెంచుకుంది. అయితే.. గంభీర్ తర్వాత కేకేఆర్ టీమ్ పగ్గాలు అందుకున్న దినేశ్ కార్తీక్ గత రెండేళ్లుగా అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ టోర్నీలో మంచి క్రేజ్‌ ఉన్న టాప్-3 టీమ్స్‌లో ఒకటిగా కోల్‌కతా కొనసాగుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ సీనియర్ వికెట్ కీపర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

 నేను ఆస్వాదిస్తున్నా..

నేను ఆస్వాదిస్తున్నా..

‘ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీ ఓనర్లు ఆటగాళ్లని చూసే విధానం, గెలుపోముల్ని స్వీకరించే తీరుని నేను మొదటి నుంచి గమనిస్తున్నా. ఈ క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే..? ఆటగాళ్లని హ్యాండిల్ చేయడంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బెస్ట్ అని. క్లిష్ట పరిస్థితుల్లోనూ కేకేఆర్ ఫ్రాంఛైజీ.. ఆటగాళ్లతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. కోల్‌కతా జట్టులో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నా'' అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.

 ఐదు ఫ్రాంచైజీలు..

ఐదు ఫ్రాంచైజీలు..

ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో తొలుత ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ఆడాడు. అయితే.. 2018 ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల వేలంలో దినేశ్ కార్తీక్‌ను రూ. 7.4 కోట్లకి కొనుగోలు చేసిన కోల్‌కతా.. అనూహ్యంగా అతనికి సారథ్య బాథ్యతలు అప్పగించింది.

 దినేశ్ కార్తీక్‌పై వేటు వేస్తారని..

దినేశ్ కార్తీక్‌పై వేటు వేస్తారని..

వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్‌కి దినేశ్ కార్తీక్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభమన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారని వార్తలు వచ్చాయి. గత రెండు సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వైఫల్యానికి కారణం అతని పేలవ కెప్టెన్సీ అనే విమర్శలు వచ్చాయి. కానీ.. కరోనాతో క్రికెట్‌కు బ్రేక్ రావడంతో ఈ చర్చ కనుమరుగైంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, July 28, 2020, 12:07 [IST]
Other articles published on Jul 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X