Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే నా లక్ష్యం: దినేశ్ కార్తీక్

Dinesh Karthik says I have been doing everything I can to be part of the Indian team

ముంబై: భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని వెటరన్ వికెట్ కీపర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫినిషర్ దినేశ్ కార్తీక్ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్‌) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దాంతో ఆర్‌సీబీ 16 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో నిలకడగా ఆడుతూ ఆర్‌సీబీ ఫినిషర్‌గా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. దాంతో అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో దినేశ్ కార్తీక్‌ను తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది.

ఇక మ్యాచ్ అనంతరం కార్తీక్ సైతం టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పాడు. టీమిండియాలో చోటు కోసం తాను అన్ని విధాలుగా క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జట్టు త‌రపున ఆడాల‌న్నత‌న కోరిక‌ను కార్తీక్ వ్య‌క్తం చేశాడు. "భారత్ త‌రుపున మ‌ళ్లీ ఆడాలనేది నా ల‌క్ష్యం. టీ20 ప్రపంచకప్‌ దగ్గరలోనే ఉందని నాకు తెలుసు.నేను జట్టులో చోటు కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాను

వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టులో బాగ‌మై భార‌త్ విజ‌యంలో నా వంతు పాత్ర పోషించాలి అనుకుంటున్నాను. భార‌త్ ఐసీసీ టోర్న‌మెంట్‌ల‌ను గెలిచి చాలా కాలం అయ్యింది. కాబట్టి భార‌త్ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో టైటిల్ నెగ్గాల‌ని కోరుకుంటున్నాను" అని కార్తీక్ పేర్కొన్నాడు. కాగా 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ జ‌ట్టుకు కార్తీక్ ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. నిదహాస్ ట్రోఫీలో లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి గెలిపించిన అతని ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. ధోనీ రిటైర్మెంట్ నుంచి టీమిండియాలో సరైన ఫినిషర్ లేడు. ఆ స్థానాన్ని కార్తీక్‌తో భర్తీ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Dinesh Karthik says I have been doing everything I can to be part of the Indian team

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్‌) తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 55) అర్ధ సెంచరీ సాధించగా, షహబాజ్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 32 నాటౌట్‌) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు 66), రిషభ్‌ పంత్‌ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 34) మెరిశారు. బెంగళూరు బౌలర్లు హేజల్‌వుడ్‌ (3/28), సిరాజ్‌ (2/31) రాణించారు.

Story first published: Sunday, April 17, 2022, 12:36 [IST]
Other articles published on Apr 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+