
లండన్: కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తనదైన వ్యాఖ్యనంతో అభిమానులను అలరిస్తునే ఉన్నాడు. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్‌లోనే ఉన్న దినేశ్ కార్తీక్.. వరుసగా భారత ఆటగాళ్లను ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన కార్తీక్.. అతడి జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను అభిమానులకు అందించాడు.
తాజాగా భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మతో మాట్లాడాడు. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. దీనికి ముందు.. రోహిత్‌ను డీకే ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన స్నీక్ పీక్ ఒకటి.. తన ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. అందులో.. రోహిత్ పెళ్లి తర్వాత ఎలా మారిపోయాడనే విషయాన్ని కార్తిక్ తెలియజేసే ప్రయత్నం చేశాడు.
హీరో విజయ్‌తో ధోనీ : ఏదైనా భారీ ప్లాన్‌లో ఉన్నారా..(ఫోటోలు)
'రితిక సజ్దేతో వివాహానికి ముందు రోహిత్ శర్మ 'సూర్యవంశం' సినిమా చూసిన ఏడ్చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత.. రోహిత్ పూర్తిగా మారిపోయాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నాడని దినేశ్ కార్తీక్ చెప్పగా.. రోహిత్ శర్మ నవ్వుతూ బదులిచ్చాచ్చాడు. "ఎవరు చెప్పారు నీకు ఇది? నిజమే.. చాలా మారింది" అంటూ రోహిత్ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను డీకే.. రోహిత్ శర్మ ఇంటర్వ్యూకు సంబంధించిన స్నీక్ పిక్ ఇది.. సెకండ్ టెస్ట్ సందర్భంగా మీ ముందుకు పూర్తి ఇంటర్వ్యూ వస్తుంది. సారీ రోహిత్ నీ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

వర్షం కారణంగా తొలి టెస్ట్‌లో విజయానికి దూరమైన టీమిండియా.. ఇంగ్లండ్‌తో కీలకమైన రెండో టెస్ట్‌కు రెడీ అయ్యింది. గురువారం (మధ్యాహ్నం 3.30 గంటల) నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో మరింత మెరుగైన బ్యాటింగ్ షో చూపెట్టాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌నూ మరింత బలోపేతం చచేయాలని భావిస్తోంది. ఒకే ఒక మార్పు మినహా టీమిండియా బృందంలో సమస్యలేమీ లేకపోగా... ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లండ్ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్ సమస్యను మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లండ్‌పై ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అయితే లార్డ్స్‌లో కూడా వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యం కానుంది.
భారత తుది జట్టులో ఒక మార్పు అనివార్యమైంది. స్టార్ పేసర్ శార్దుల్ ఠాకూర్ తొడ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. అయితే తొలి టెస్ట్‌లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ స్ట్రాటజీ అద్భుత ఫలితం ఇవ్వడంతో.. ఇప్పుడు ఐదో బౌలర్‌గా స్పిన్నర్ అశ్విన్‌ను ఆడించాలా? లేక పేసర్లు ఇషాంత్, ఉమేశ్‌లో ఎవర్ని తీసుకోవాలి? అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. అయితే లోయరార్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలంటే కచ్చితంగా అశ్విన్‌కే చోటు దక్కుతుంది. గ్రీన్ టాప్ వికెట్ ఉంటే మాత్రం ఇషాంత్ తుది జట్టులోకి వస్తాడు.