For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్ గిల్‌ కాదు.. మెక్‌కల్లమ్ ప్లేయర్ ఆఫ్‌ద సిరీస్‌‌ అతనే!

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసుకుంది. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన పోరులో పడిలేచిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌‌లో భారత్ 396 పరుగులు సాధించింది.

Dinesh Karthik Reveals Brendon McCullum s Initial Player of the Series Choice Was Shubman Gill

ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 754 పరుగులు చేశాడు. దాంతో అతనికి బ్రెండన్ మెక్‌కల్లమ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు. అయితే మెక్‌కల్లమ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్‌ను సిరాజ్‌కు ఇవ్వాలనుకున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తెలిపాడు.

'మ్యాచ్‌ నాలుగో రోజే ముగుస్తుందని భావించిన మెక్‌కల్లమ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డ్‌కు శుభ్‌మన్ గిల్‌ను ఎంచుకున్నాడు. ప్రజెంటర్ మైక్ అథర్టన్ కూడా శుభ్‌మన్ గిల్‌కు సంబంధించిన ప్రశ్నలను సిద్దం చేసుకున్నాడు. కానీ ఆఖరి రోజు ఆట తర్వాత మెక్‌కల్లమ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ ఇవ్వాలని చెప్పాడు. కానీ అప్పటికే శుభ్‌మన్ గిల్ పేరును ఖరారు చేయడంతో మార్చడం కుదరలేదు.'అని క్రిక్ బజ్‌తో దినేశ్ కార్తీక్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఐదుకు మ్యాచ్‌లు ఐదు ఆడిన ఏకైక పేసర్ సిరాజ్. ఈ సిరీస్‌లో 185.3 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన సిరాజ్..23 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి టెస్ట్‌లో 9 వికెట్లు తీసాడు.

Story first published: Tuesday, August 5, 2025, 16:07 [IST]
Other articles published on Aug 5, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+