Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. దినేశ్ కార్తీక్ కామెంట్రీపై దుమారం!

Dinesh Karthik receives criticism after his sexist comment on air

లండన్‌: ఇటీవలే కామెంటేటర్‌గా అవతారమెత్తి అందరిచేత శభాష్ అనిపించుకున్న టీమిండియా వెటరన్ క్రికెట్ దినేశ్ కార్తీక్ వివాదంలో చిక్కుకున్నాడు. భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో కామెంట్రీ షురూ చేసిన ఈ తమిళనాడు క్రికెటర్.. తనదైన వ్యాఖ్యానంతో అందర్ని ఆకట్టుకున్నాడు. సరదా జోకులు, సహచరులపై పంచ్‌లు విసురుతూ దిగ్గజ వ్యాఖ్యతల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి దినేశ్ కార్తీక్ తాజాగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లండ్, శ్రీలంక మధ్య గురువారం జరిగిన రెండో వన్డే సందర్భంగా దినేశ్ కార్తీక్ చేసిన వ్యాఖ్యనంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది.

కార్తీక్ ఏమన్నాడంటే..?

మ్యాచ్ జరుగుతుండగా.. బ్యాట్స్‌మెన్‌, బ్యాట్ల మ‌ధ్య రిలేష‌న్‌షిప్ గురించి మాట్లాడుతూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. 'బ్యాట్స్‌మెన్, బ్యాట్లను ఇష్టపడకపోవడమనేవి రెండు వేర్వేరు విషయాలు కావు. చాలామంది బ్యాట్స్‌మెన్‌ తమ బ్యాట్లను ఇష్టపడ్డట్లు కనిపించరు. వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడతారు. బ్యాట్లనేవి చుట్టుపక్కల ఉండే పరాయి పురుషుల భార్యల్లాంటివి. అవెప్పుడూ సౌకర్యవంతంగా కనిపిస్తాయి'అని దినేశ్‌ కార్తీక్ సరదాగా చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చెలరేగుతున్నాయి. బ్యాట్లను పరాయి పురుషుల భార్యలతో పోల్చి చూడడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

క్షమాపణలు చెప్పాల్సిందే..

మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దినేశ్ కార్తీక్ క్షమాపణ చెప్పాల్సిందేనని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. దినేశ్ కార్తీక్ నుంచి ఇలాంటి వ్యాఖ్యానాన్ని ఊహించలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ జోక్స్‌తో వ్యాఖ్యానం చేయకూడదని మరొకరు చురకలంటిస్తున్నారు. ఏదీ ఏమైనా దినేశ్ కార్తీక్ చాలా తప్పుగా మాట్లాడాడని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు. ఇలా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన దినేశ్ కార్తీక్ కామెంట్రీని ఎలా మెచ్చుకుంటున్నారని కూడా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నీ గతానుభవంతోనా?

ఇక దినేశ్ కార్తీక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను లాగుతూ మరి విమర్శలు గుప్పిస్తున్నారు. 'కార్తీక్ నీ గతానుభవాన్ని అందరికి వర్తింపజేసి మాట్లాడితే ఎలా?'అని ప్రశ్నిస్తున్నారు. ఇక కార్తీక్ మొదటి భార్యను భారత ఓపెనర్ మురళీ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇరు కుటుంబాల పరస్పర అంగీకరంతోనే జరిగింది. ఆ తర్వాత కార్తీక్.. భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను చేసుకున్నాడు. తన జీవితంలో జరిగిన సంఘటన గుర్తొచ్చే కార్తీక్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

కాకా ఇలాంటివి వద్దే..

ఇలాంటి చెత్త జోకులు మరోసారి రిపీట్ చేయవద్దని కొందరు దినేశ్ కార్తీక్‌కు సూచిస్తున్నారు. 'దినేశ్ కాకా ఇలాంటి చెత్త జోకులతో కూడిన కామెంట్రీ వద్దు. మరింత జ్ఞానం సంపాదించి ప్రొఫెషనల్‌గా కామెంట్రీ చెప్పాలి'అని కోరుతున్నారు. వాట్సాప్ జోక్స్‌ నమ్ముకొని వ్యాఖ్యానం చెబితే ఇలానే ప్రమాదాల్లో చిక్కుకుంటారని హెచ్చరిస్తున్నారు. మరికొందరు మాత్రం కార్తీక్‌కు అండగా నిలుస్తున్నారు. ఇందులో తప్పుపట్టాల్సిందేం లేదని, సరదాగా తీసుకోవాలంటున్నారు. ప్రతీది భూతద్దం పెట్టి చూడవద్దని హితవు పలుకుతున్నారు.

Story first published: Saturday, July 3, 2021, 10:15 [IST]
Other articles published on Jul 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+