WTC Final: ఇంకా పరుగులు రావాల్సింది.. దరిద్రం అప్పుడలానే జరిగింది! కామెంటేటర్‌గా దుమ్మురేపుతున్న డీకే!

సౌతాంప్టన్: ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూసిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఎట్టకేలకు మొదలైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మెగా ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి శుభారంభాన్ని అందించారు. 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది. ఉదయం నుంచి డీకే మ్యాచ్ అప్‌డేట్స్ అందిస్తున్నారు. ట్విటర్ వేదికగా అక్కడి వాతావరణ పరిస్థితులను తెలియజేశాడు.
అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత తనదైన వ్యాఖ్యానంతో డీకే అభిమానులను అలరిస్తున్నాడు. సమయస్పూర్తితో సహచర కామెంటేటర్లపై పంచ్‌లు వేస్తూ.. చలోక్తులు పేల్చుతూ ఆకట్టుకుంటున్నాడు.
మరిన్ని రన్స్ రావాల్సింది..
అయితే ఈ క్రమంలోనే డీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి 6 ఓవర్లలో 16 పరుగులు చేసింది. అయితే వాస్తవానికి భారత జట్టుకు మరిన్ని పరుగులు రావాల్సిందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ తడిగా మారడంతో బంతి వేగంగా బౌండరీకి వెళ్లడం లేదని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ బౌండరీకి వెళ్లాలని కానీ వెళ్లలేదన్నాడు. దాంతో నలుగు రన్స్ వచ్చే దగ్గర, మూడు, రెండు మాత్రమే వచ్చాయన్నాడు.
దరిద్రం అప్పుడలానే..
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో కూడా భారత్ ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొందని దినేశ్ కార్తీక్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో మిడిలార్డ్‌లో బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్(25 బంతుల్లో 6) ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ చాలా బాధ్యతాయుతంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతను కొట్టిన పలు షాట్లు బౌండరీకి వెళ్లలేకపోయాయి. ఆ తర్వాత హెన్రీ బౌలింగ్‌లో జిమ్మీ నీషమ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అయితే ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం రావడం.. రిజర్వేడే రోజు భారత్ బ్యాటింగ్ చేయడం కొంపదీసింది. చాలా షాట్లు ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా బౌండరీకి వెళ్లలేదు. తాజాగా ఇదే విషయాన్ని కార్తీక్ గుర్తు చేసుకున్నాడు.
ఫ్యాన్స్ ఫిదా..
ఇక దినేశ్ కార్తీక్ కామెంట్రీ పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా డీకే వ్యాఖ్యానంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కార్తీక్ కామెంటేటర్‌గా దుమ్మురేపుతున్నాడని ఓ అభిమాని కామెంట్ చేయగా.. భారత తరఫున దినేశ్ కార్తీక్ కామ్ బాక్స్‌లో ఆకట్టుకుంటున్నాడని మరో యూజర్ ట్వీట్ చేశాడు. త్వరలోనే కార్తీక్ బెస్ట్ కామెంటేటర్‌గా నిలుస్తాడని, తన వ్యాఖ్యనంతో సహచర కామెంటేటర్లను స్లెడ్జ్ చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్ ట్యాగ్ ట్విటర్ ట్రెండ్ అవుతుంది.

రోహిత్ శర్మ ఔట్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(34) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కైల్ జెమీసన్ వేసిన 21 ఓవర్ ఫస్ట్ బాల్‌ను హిట్ మ్యాన్ హాఫ్ షాట్ ఆడగా.. థర్డ్ స్లిప్‌లోకి దూసుకొచ్చిన లో క్యాచ్‌ను టిమ్ సౌథీ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి చతేశ్వర్ పుజరా(0 బ్యాటింగ్) రాగా శుభ్‌మన్ గిల్(27 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ముందుకు నడిపిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications