కోహ్లీ సంచలన నిర్ణయం వెనుక కారణం తెలియదు.. కానీ ధోనీ ముందే చెప్పాడు: దినేశ్ కార్తీక్

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాంతో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసినట్లు అయింది. ఇప్పటికే పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మనే సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీ చేపట్టడం ఖాయామైంది. అయితే బీసీసీఐ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. టెస్ట్ కెప్టెన్సీపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే టెస్ట్ కెప్టెన్సీ వ్యవహరంపై తాజాగా స్పందించిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ ముందే చెప్పాడు..
టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణమేంటో తనకు తెలియదన్న కార్తీక్.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. భారత క్రికెట్‌లో వేర్వేరు కెప్టెన్ల విధానం పనికిరాదని ధోనీ ముందే చెప్పాడన్నాడు. 'క్రికెట్ దేశమైన భారత్‌లో వేర్వేరు కెప్టెన్ల విధానం అస్సలు వర్కౌట్ కాదని ధోనీ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి'అని ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐతో కార్తీక్ అన్నాడు.

బలమైన కారణమే..
విరాట్ కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. 'టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల కారణం విరాట్ కోహ్లీ ఒక్కడికే తెలుసుంటుంది. ఆ విషయం గురించి నేను మాట్లాడటం ఏ మాత్రం బావ్యం కాదు. విరాట్ నిర్ణయం వెనుక ఓ బలమైన కారణమే ఉండి ఉంటుంది. అతను తన సారథ్యంలో భారత జట్టును ఓ స్థాయికి చేర్చాడు.

కోహ్లీ గురించి బాగా తెలుసు..
అతని సారథ్యంలో ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎంత ఎఫర్ట్ పెడుతాడనే విషయం నాకు బాగా తెలుసు. జట్టు విజయం కోసం సాయశక్తులా కృషి చేస్తాడు. అతని కెప్టెన్సీ ప్రయాణంలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. భారత టెస్ట్ కెప్టెన్లలో అతను అగ్రస్థానంలో ఉంటాడు. కెప్టెన్‌గా వెనక్కి తిరిగి చూసుకుంటే కోహ్లీకి మధుర జ్ఞాపకలే కనబడతాయి'అని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ విరాట్ కోహ్లీ కీలకం కానుంది. ఈ సిరీస్‌లో అతను బ్యాట్‌తో సత్తాచాటాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications