మీ వల్లే నా కల సాకారమైంది.. థ్యాంక్స్ డార్లింగ్స్! దినేశ్ కార్తీక్ భావోద్వేగం!

న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆడాలనే తన కల సాకారమవ్వడంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టీమ్ పాత్ర కీలకమని ఆ జట్టు హిట్టర్, టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఆర్‌సీబీ టీమ్, అభిమానుల సహాయ, సహకారాలతోనే తన కల సాకారమైందని తెలిపాడు. ట్విరట్ వేదికగా ఆర్‌సీబీ సపోర్ట్ స్టాఫ్, అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ దినేశ్ కార్తీక్ భావోద్వేగానికి గురయ్యాడు.
థ్యాంక్స్ డార్లింగ్స్..
'ఆర్‌సీబీ జట్టుకు, అభిమానులకు ధన్యవాదాలు. వీరు అందించిన సహాయ, సహకారాల వల్లే ప్రపంచకప్ ఆడేలానే నా కల సాకారమయ్యింది. మరీ ముఖ్యంగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు కూడా ఆర్‌సీబీ ఆర్‌సీబీ అని జపించే అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆర్‌సీబీ కోచ్ సంజయ్ బంగర్, డైరెక్టర్ మైక్ హెస్సెన్, ఫీల్డింగ్ కోచ్ రంగరాజన్, బసులకు ఎంతో రుణపడి ఉంటా.'అని ట్వీట్ చేశాడు.

కామెంట్రీ చెప్పి..
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకు దూరమైన దినేశ్ కార్తీక్.. అటు ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించలేదు. దాంతో కామెంటేటర్‌గా కూడా అవతారామెత్తి సునీల్ గవాస్కర్‌లతో కలిసి వ్యాఖ్యానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. కామెంట్రీ దిగ్గజాలపై హర్షాభోగ్లే, రవిశాస్త్రిలు కూడా దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానానికి ఫిదా అయ్యారు. దాంతో కార్తీక్ కెరీర్ ముగిసినట్లే అంతా అనుకున్నారు. దానికి తోడు ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు కేకేఆర్ కూడా వదిలేయడంతో అతన్ని వేలంలో ఎవరూ కొనుగోలు చేయరని భావించారు.

ఆర్‌సీబీతో అదరగొట్టి..
అనూహ్యంగా ఆర్‌సీబీ అతన్ని కొనుగోలు చేసి.. ఫినిషర్‌గా బరిలోకి దించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కార్తీక్ దుమ్మురేపాడు. తనదైన విధ్వంసంతో ఓడిపోయే మ్యాచ్‌లను గెలిపించాడు. ఆర్‌సీబీ తరఫున 16 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 183.33 స్ట్రైక్‌రేట్, 330 పరుగులతో టీమిండియా ఫినిషర్‌గా తాను పనికివస్తానని చాటి చెప్పాడు.

ఆసియాకప్‌లోనూ..
ఈ ప్రదర్శనతో సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఇండియా ఆడిన దాదాపు ప్రతీ సిరీస్ లోనూ కార్తీక్ అవకాశం అందుకున్నాడు. తన ఫామ్‌ను కొనసాగించాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో ఆడినా అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో అతని స్థానంలో పంత్‌ను తీసుకొని టీమిండియా మూల్యం చెల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications