'టీ20 ప్రపంచకప్‌లో ఆ ముగ్గురు ఆటగాళ్లు చాలా డేంజర్.. ప్రత్యర్థికి పెద్ద తలనొప్పే'

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 పూర్తి షెడ్యూల్ తాజాగా విడుదల అయిన విషయం తెలిసిందే. యూఏఈలో క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం కానుంది. అక్టోబర్ 17న మధ్యాహ్నం 2 గంటలకు రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం అవుతుంది. ఇక అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఆడనున్నాయి. మెగా టోర్నీ కోసం కొన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి.

ఆ ముగ్గురు డేంజర్
టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతుండడంతో అందరూ తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో తీవ్ర ప్రభావం చూపే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, కామెంటేటర్ దినేష్ కార్తీక్ చెప్పాడు. వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు సత్తాచాటగలరని జోస్యం చెప్పాడు.
ఈ ముగురు టోర్నీలో అద్భుతాలు చేయగలరని, మిగిలిన జట్లకు పెద్ద తలనొప్పిగా మారగలని అంచనా వేశాడు. కార్తీక్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నాడు స్కై స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. స్కై స్పోర్ట్స్ ప్రెజెంటర్ ఇషా గుహా, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే పొట్టి కప్‌పై మాట్లాడాడు.

హార్దిక్ పాండ్యా
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్ర ప్రభావం చూపుతాడని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. 'పాండ్యాకు 2019లో శస్త్రచికిత్స జరిగింది. అతడు జట్టులోకి తిరిగివచ్చినప్పటి నుంచి బ్యాటింగ్‌లో నిరంతరం కష్టపడుతున్నాడు. గత కొన్ని నెలలుగా భారత్, ముంబై ఇండియన్స్ జట్లకు బౌలింగ్ చెయ్యట్లేదు.
శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో రెండు వన్డేల్లో 19, 0 పరుగులు చేశాడు. అయినా పాండ్యా ఎప్పుడూ సవాలు విసిరే ఆటగాడే. సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే కీలక ఆటగాళ్లలో అతడు ఒకడు అని నమ్ముతా. పాండ్యా టీ20 ప్రపంచకప్‌లో కీలక ఆటగాడిగా మారబోతున్నాడు' అని డీకే అన్నాడు.

భారత్ తడబడినప్పుడు
'ఐసీసీ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లలో పోరాడటానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు జట్టుకు కావాలి. టీమిండియాలో అలాంటి ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. అతను బ్యాట్, బంతి రెండింటిలోనూ సహకరిస్తాడు. ఎందుకంటే భారతదేశం తడబడినప్పుడు.. రన్ రేట్‌ను పెంచే బాధ్యతను పాండ్యా తీసుకుంటాడు. బౌలర్ ఎవరైనా.. మైదానంలోని నలుమూలకు బంతిని తరలించగలడు. నేను అతని ఆటను చూసి ఎంజాయ్ చేస్తా. అతను చాలా తెలివైనవాడు. అతను ఈ బృందానికి అధిపతి అవుతాడు. భారత్ తరఫున హార్దిక్ కచ్చితంగా మెరుస్తాడు' అని దినేష్ కార్తీక్ చెప్పాడు.

నికోలస్ పూరన్
వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ గురించి వ్యాఖ్యాత దినేష్ కార్తీక్ మాట్లాడుతూ... 'నికోలస్ పూరన్ నాకు ప్రత్యేకమైన ఆటగాడు. అతను తన కెరీర్‌ను ముగించినప్పుడు టీ20 ఫార్మాట్‌లో గొప్ప ఆటగాడు అవుతాడు. ఎందుకంటే అతని బ్యాటింగ్ అద్భుతమైనది. ఎవరూ ఆడలేని బంతులను కూడా నికోలస్ సులభంగా ఆడగలడు. ఇప్పటివరకు కొట్టిన దూరం కంటే.. అతడు క్రికెట్ బంతిని మరింత బాదగలడు. ఒకవేళ వెస్టిండీస్ టోర్నమెంట్ గెలవాలంటే పూరన్ చెలరేగాల్సిందే. విండీస్ జట్టుకు పూరన్ చాలా ముఖ్యమైన ఆటగాడిగా మారుతాడు' అని పేర్కొన్నాడు.

మిచెల్ స్టార్క్
ఇక ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గురించి డీకే మాట్లాడుతూ... 'మిచెల్ స్టార్క్ ఫామ్ అందుకుంటే ఆస్ట్రేలియాకు పెద్ద ఊరట లభించినట్టవుతుంది. డెత్ ఓవర్లలో అతను చాలా కీలకం. ఇటీవల కాలంలో అతని పనితీరు బాగోలేదు. కానీ వెస్టిండీస్‌తో ఆడిన చివరి సిరీస్‌లో ప్రత్యేకించి వన్డేల్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను తన వేగవంతమైన బంతులతో ప్రత్యర్థులను
హడలెత్తించాడు. ఫామ్ అందుకున్నట్టే కనబడుతోంది. ఈ టోర్నమెంట్‌లో ప్రత్యర్థి జట్లకు ఆస్ట్రేలియా ఏదైనా నష్టం చేయాలనుకుంటే.. అది కేవలం స్టార్క్ వల్లే సాధ్యం సవుతుంది. అందుకే మెగా టోర్నీలో అతడు కీలకం కానున్నాడు' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
Tokyo Olympics 2021: ఆటగాళ్ల వస్తువులను వేలం వేయనున్న ప్రధాని మోదీ! జావెలిన్, రాకెట్, గ్లోవ్స్ ఎంతపలికేనో?