
ఫస్ట్ వైఫ్ మోసం..
'దినేశ్ కార్తీక్ టీమిండియా సెకండ్ వికెట్ కీపర్‌గా తమిళనాడు కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న టైమ్‌లో అతని టీమ్‌మేట్ మురళీ విజయ్.. కార్తీక్ మొదటి భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం కార్తీక్‌కు తప్పా తమిళనాడు టీమ్ మొత్తానికి తెలుసు. ఒకరోజు అతని మొదటి భార్య ఈ విషయాన్ని కార్తీక్‌కు తెలియజేసింది. మురళీ విజయ్ కారణంగా గర్భం దాల్చినట్లు చెప్పి విడాకులు ఇవ్వాలని కోరింది. విడాకులు తీసుకున్న ఆమె మురళీ విజయ్‌తో సహజీవనం మొదలుపెట్టింది. ఆ టైమ్‌లో విజయ్.. సీఎస్‌కే, టీమిండియా ఓపెనర్‌గా రాణిస్తున్నాడు.

పిచ్చోడిలా మారిన కార్తీక్..
ఈ ఊహించని పరిణామంతో దినేశ్ కార్తీక్ డిప్రెషన్‌కు లోనయ్యాడు. దేవదాస్‌లా మారాడు. అతని ప్రదర్శన కూడా దెబ్బతిన్నది. టీమిండియాలో చోటు కోల్పోవడంతో పాటు తమిళనాడు కెప్టెన్సీ బాధ్యతలను కోల్పోయాడు. ఐపీఎల్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. రంజీట్రోఫీలో సహచర ఆటగాళ్ల చేత అవమానానికి గురయ్యాడు. ఆత్మహత్యాయత్నం చేశాడు. జిమ్‌కు వెళ్లడం మానేసాడు. ఈ విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్ ట్రైనర్.. అతని ఇంటికెళ్లి వ్యక్తిగతంగా కలిసాడు. జీవితంపై ఆశలు పెంచి మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టేలా చేసాడు. ట్రైనర్ సూచనలతో మళ్లీ జిమ్ చేయడం మొదలుపెట్టిన దినేశ్ కార్తీక్‌కు అక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్న భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పరిచయమైంది.

ఊపిరి పోసిన పల్లికల్ ప్రేమ..
దినేశ్ కార్తీక్‌ను అలా చూసి పల్లికల్ షాక్ అయ్యింది. అతని స్టోరీ తెలుసుకొని తీవ్రంగా బాధపడింది. ట్రైనర్‌తో కలిసి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. పల్లికల్ పరిచయం కార్తీక్ జీవితానికి ఊపిరి అయింది. దినేశ్ కార్తీక్‌ను దీపికా ఎంకరేజ్ చేయడంతో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన అతను.. డొమెస్టిక్ మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. భారత జట్టుకు ఎంపికవ్వడంతో పాటు కేకేఆర్ కెప్టెన్సీ అందుకున్నాడు. దీపికా పల్లికల్‌ను పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు టీమిండియాలో అతని స్థానాన్ని రిషభ్ పంత్ భర్తీ చేసాడు. మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.

పల్లికల్ సూచనలతోనే..
34 ఏళ్ల వయసులో అతని కెరీర్ చివరి దశకు చేరిందని భావించిన కార్తీక్.. కేకేఆర్ కెప్టెన్సీ వదిలేసాడు. రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాలనుకున్నాడు. కానీ పల్లికల్ అప్పటికే గర్భవతి. మధ్యలో కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. ఈ జంటకు కవల పిల్లలు జన్మించారు. పల్లికల్ తన కెరీర్‌కు పూర్తిగా దూరమైంది. లగ్జరీ ఇళ్లు కొనాలన్నది కార్తీక్ కల. దానికి చాలా డబ్బులు కావాలని భావించిన ఈ జంట మళ్లీ తమ కెరీర్‌లపై దృష్టిసారించాయి. ఇద్దరూ కలిసి ట్రైనింగ్ మొదలుపెట్టారు. మొత్తానికి వారు కలలు కన్న ఇంటిని సొంతం చేసుకున్నారు.

ఆర్‌సీబీతో మళ్లీ రీఎంట్రీ..
దినేశ్ కార్తీక్‌కు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ నుంచి కాల్ వచ్చింది. ధోనీ వారసుడిగా తీసుకోవాలనుకుంటున్నామని ఆయన కార్తీక్‌కు తెలిపాడు. అయితే వేలంలో అనూహ్యంగా చెన్నైతో పోటీపడ్డ ఆర్‌సీబీ కార్తీక్‌ను సొంతం చేసుకుంది. దీపికా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ డబుల్స్, వుమెన్స్ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. దినేశ్ కార్తీక్ ఆర్‌సీబీ తరఫున దుమ్మురేపుతున్నాడు. టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లకు కార్తీక్ ఎంపికవ్వనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ధోనీ పాత్రలో హిట్టర్‌గా అవకాశాన్ని అందుకోవడానికి అడుగుదూరంలో నిలిచాడు. దీపికా-కార్తీక్‌ల జీవిత ప్రయాణం అద్భుతం.' జీవితంలో ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి కార్తీక్ కాక జీవితమే ఓ ఉదహారణ.


Click it and Unblock the Notifications













